Advertisement
సమంత ప్రస్తుతం యశోద సక్సెస్ తో జోష్ లో ఉన్నారు. సమంత యశోద సినిమాకు పెట్టిన బడ్జెట్, చేసిన బిజినెస్ మీద రకరకాల వార్తలు వచ్చాయి. సినిమాకు పెట్టిన దానికి, అమ్మిన దానికి చాలా తేడా ఉందని, నిర్మాత సేఫ్ జోన్ లో ఉన్నాడంటూ ట్రేడ్ వర్గాలు చెప్పుకున్నాయి. థియేట్రికల్ బిజినెస్ ఎలా జరుగుతుందన్నది, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయా? లేదా? అన్నది ఇక చూడాలి. దాదాపు 50 కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దాదాపు $200K డాలర్లను రాబట్టినట్టు తెలుస్తోంది.
Advertisement
కానీ ఇండియాలో ఈ మూవీ కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా రానట్టు కనిపిస్తోంది. అయితే యశోద మూవీ కలెక్షన్ల విషయంలో పుంజుకోవాలంటే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచాల్సి ఉందని కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం. సమంత తన సినిమాలలో హీరో పాత్రలలో తెలుగులో అంతో ఇంతో పాపులర్ అయిన తెలుగు హీరోలను ఎంపిక చేసుకోవాలని, అలా చేస్తే సమంత సినిమాలకు బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Advertisement
పెద్దగా గుర్తింపు లేని హీరోలు సమంతకు జోడిగా నటిస్తుండటంతో ఫ్యాన్స్ సైతం ఒకింత ఫీలవుతున్నారు. సామ్ తన సినిమాల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతుండగా సమంత పారితోషకం ప్రస్తుతం 5 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉందని సమాచారం. సమంత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సమంతకు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సమంత నటించిన సినిమాలు సమంత రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. సమంత పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు ఓటేస్తుండటం గమనార్హo.
Read Also : సమంత తరహాలో అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు