Advertisement
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఏ మాయ చేసావే చిత్రం నుంచి.. తాజాగా విడుదలైన యశోద చిత్రం వరకు.. దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే స్టార్ హీరోయిన్ గా కెరియర్ సాగుతున్న టైంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది.
Advertisement
Read also: ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?
Advertisement
ఆ తర్వాత అసలు కారణాలు ఏంటో తెలియదు కానీ.. పెళ్లయిన నాలుగు సంవత్సరాల తర్వాత నాగచైతన్య – సమంత విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పేశారు. ఇక విడాకుల తర్వాత సమంత పూర్తి ఫోకస్ సినిమాలపై పెట్టి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. సమంత పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. సమంతా రుత్ ప్రభు కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగింది. సమంత తండ్రి ప్రభు తెలుగువాళ్లు కాగా.. తల్లి నీవేట్ ది మాత్రం కేరళ. ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం నిమిత్తమై వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యారు. దీంతో సమంత చదువులన్ని తమిళనాడు రాష్ట్రంలోనే పూర్తి అయ్యాయి. సమంత తల్లిదండ్రులకు జోనాధన్, డేవిడ్ తర్వాత సమంత మూడో సంతానం.
సమంత చిన్నది కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. అయితే సమంతకి డిగ్రీ చదువుతున్న సమయంలోనే నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతో అప్పుడప్పుడు పలు కాలేజ్ కల్చరర్ ఈవెంట్లలో పాల్గొనేది. ఈ క్రమంలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే సమంతకి తమిళనాడు కి చెందిన ఆశిక టెక్స్ టైల్స్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తీసిన యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. పాకెట్ మనీ కోసం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో సమంత ఆ యాడ్ లో నటించింది. ఇందుకుగాను అప్పట్లో సమంతకి దాదాపు 5వేల రూపాయల పారితోషకం ఇచ్చారట. కాగా ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.