Advertisement
బాలకృష్ణ, వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్ లో మాట్లాడుతూ షూటింగ్ లో నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని ఇవే మాట్లాడుకునేవాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. కాగా బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీన్ని పదేపదే చెబుతూ, సోషల్ మీడియాలో కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు.
Advertisement
తాజాగా ఇదే అంశంపై అక్కినేని హీరో నాగ చైతన్య కూడా స్పందించారు. నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరిస్తే మనలను మనం అగౌరవ పరుచుకున్నట్టే. ఆయన వాక్యాలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా ఓ పోస్ట్ పెట్టాడు. దీనినే అఖిల్ కూడా షేర్ చేశాడు. ఇది ఇలా ఉండగా ఈ విషయంపై తాజాగా, సమంత కూడా స్పందించినట్లు తెలుస్తుంది.
Advertisement
బాలయ్య నోట అలాంటి మాటరావడం బాధాకరమని, పొరపాటున ఫ్లోలో వచ్చి ఉండవచ్చని, అలాగే మనకు ఒక దారి చూపిన వారిని కించపరిచే విధంగా వాక్యాలు చేయడం తప్పు అని బాలయ్య వాక్యాలపై స్పందించినట్లు సమాచారం. అంటే సమంత అక్కినేని ఫ్యామిలీతో మళ్ళీ కలవబోతుందా? ఇక ఈ విషయం ఎన్ని వివాదాలకు తెర లేపుతుందో చూడాలి మరి.
Read also: PAWAN KALYAN : పవన్ కళ్యాణ్ స్టామినా ని బాక్స్ ఆఫీస్ కి, తెలుగు ప్రజలకి దగ్గర చేసిన 10 సినిమాలు !