Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది కానీ కొన్ని ఏళ్లకు వాళ్ళు విడిపోయారు అనంతరం విడాకులు తీసుకున్నారు సమంత. ఆ తరవాత తన కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. అయితే వరుస సినిమాలు కమిట్ అయిన టైం లో మయోసైటిస్ వ్యాధికి గురయ్యారు.
Advertisement
Advertisement
ఈ వ్యాధి కారణంగా కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తర్వాత తిరిగి తన కెరియర్ లో బిజీ అయ్యారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమంత తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. తాను కూడా ప్రేమలో మోసపోయానని అన్నారు ఇలా ప్రేమలో మోసపోయినప్పటికీ తృటిలో తన తప్పించుకున్నానని లేదంటే నా జీవితం కూడా సావిత్రి గారిలాగే అయ్యేదని ఆమె సంచలన కామెంట్స్ చేశారు.
Also read:
ఆమె జీవితం గురించి నాకు తెలియదు కానీ మహానటి సినిమాలో చేసే సమయంలో ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నానని.. ఇలా నేను కనుక తనను వదిలేయకపోతే నా జీవితం కూడా సావిత్రి గారిలాగే తయారయ్యేదని సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఆమె అలా ఎందుకు అన్నారో తెలీదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!