Advertisement
సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమంత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి కొంతకాలానికి మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో అవకాశాలని సంపాదించుకుంది. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. ఇది ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. పెద్ద నటులు, దర్శకులు, నిర్మాతలకు హేమ కమిటీ సెగ తాగుతోంది. ప్రముఖ నటి సమంత ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
తెలుగు సినిమా పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు సమస్యలపై ఇచ్చిన నివేదికను వెల్లడించాలని రేవంత్ రెడ్డిని కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని సమంత ప్రశంసించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదిక కోసం సమంత పోరాడడానికి సిద్ధమని తెలుస్తోంది.
Advertisement
Also read:
Jay Shah: కోహ్లీ, రోహిత్ శర్మకు థాంక్స్ చెప్పిన కొత్త ఐసీసీ చైర్మన్ జై షా..!
ఇంస్టాగ్రామ్ లో సమంత చేసిన పోస్ట్లు తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని.. దీనికి మార్గం చూపిన కేరళ డబ్ల్యూసిసి యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నామని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికని ప్రచురించాలని సమంత కోరారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!