Advertisement
Martin Luther king Movie Review: మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో పాటు సీనియర్ నరేష్, వెంకటేష్ మహా, శరణ్య తదితరులు నటించారు. వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు. జి వి ప్రకాష్ సంగీతాన్ని అందించారు.
Advertisement
Martin Luther King Movie Review
చిత్రం : మార్టిన్ లూథర్ కింగ్
నటీనటులు : సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్య తదితరులు
దర్శకత్వం : పూజ కొల్లూరు
సంగీతం: స్మరన్ సాయి
నిర్మాత : ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
విడుదల తేదీ : అక్టోబర్ 27, 2023
Martin Luther Storyమార్టిన్ లూథర్ కింగ్ కథ మరియు వివరణ:
ఇక కథ లోకి వెళితే.. స్మైల్ (సంపూర్ణేష్ బాబు) అనాధ. పడమరపాడు గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు ఆ ఊరిలో ఉన్న మర్రిచెట్టు తన నివాసము. ఊర్లో వాళ్ళందరూ ఎడ్డోడు, వెర్రి బాబులోడు ఇలా రకరకాలుగా పిలిచేవాళ్ళు. ఎవరైనా ఇళ్లల్లో పాచి పనులు చేయాలంటే అతన్ని పిలిచేవారు. వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో గడిపేవాడు ఎప్పటికైనా చెప్పులు షాప్ పెట్టుకోవాలని తన కల. దానికోసం రూపాయి రూపాయి దాచుకుంటూ ఉంటాడు.
ఒకరోజు ఆ డబ్బులు ఎవరో తీసేస్తారు. దీంతో తన స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు పోస్ట్ ఆఫీస్ వద్ద డబ్బులు దాచుకోవాలని అనుకుంటాడు. దీనికోసం పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే వసంత (శరణ్య ప్రదీప్) ని సహాయం అడుగుతాడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలా గుర్తింప కార్డు ఉండాలని అంటుంది.. తనకే గుర్తింపు కార్డు ఉండదు. స్మైల్ అసలు పేరు ఏంటో కూడా తెలియదు. అప్పుడు వసంత అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు పెట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. అతని పేరుణ ఓటర్ ఆధార్ కార్డు ని కూడా వచ్చేలా చేస్తుంది.
Advertisement
Martin Luther King Review
ఇంకో వైపు పడమరపాడు లో సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలవుతుంది దక్షిణ దిక్కుకి పెద్దాయన (వెంకటేష్ మహా) లోకి ఉత్తరం దిక్కు కి నాయకుడిగా జగ్గు (నరేష్) సర్పంచ్ పదవి కోసం పోటీ పడతారు సమాన ఓట్లు వస్తాయి.
ఎవరు ఓటు పడినా సర్పంచ్ పదవితో పాటు 30 కోట్ల ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మార్టిన్ లూథర్ కింగ్ కి ఓటు హక్కు వస్తుంది. లోకి, జగ్గు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. ఓటు హక్కు రావడంతో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి..? జగ్గు, లోకి ల వల్ల మార్టిన్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు..? తన ఓటుతో ఊరిని ఎలా మారుస్తాడు ఇదే కథ. ఈ సినిమాలో ఓటు విలువని తెలియజేశారు.
Martin Luther King Telugu Review
వర్తమాన రాజకీయాలపై విమర్శ నాస్త్రంగా ఉంటుంది ఈ సినిమా రీమేక్ సినిమా అయినా అటువంటి అనుభవం ఎక్కడా కలగదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథని మార్చారు. దర్శకురాలు పూజ కూడా నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు అయితే కొంచెం సినిమా డల్ గానే ఉంటుంది.
ఊరు ప్రజల వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తూ తీసిన సీన్స్ కూడా బాగున్నాయి. రాజకీయ నాయకుల నిజస్వరూపాలని సినిమా చూపించింది. సినిమా మొదటి నుండి కూడా ఫన్నీగా సినిమాని తీశారు కానీ ఈ సినిమాలో కొంచెం కామెడీ ఎమోషన్స్ అలానే ఎండింగ్ పై దృష్టి పెడితే బాగుండేది. సినిమాలో నటీనటులు వాళ్ళ పాత్రకి తగ్గట్టుగా బాగానే నటించారు. మార్టిన్ లూథర్ కింగ్ కొంతవరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
నటులు
స్టోరీ
సినిమా ఇచ్చిన మెసేజ్
మైనస్ పాయింట్స్:
పతాక సన్నివేశాలు
స్లోగా తీసిన సెకండ్ హాఫ్
Martin Luther King రివ్యూ, రేటింగ్: 2.5/5
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!