Advertisement
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ స్టార్ ప్లేయర్, అనేక వేదికలపై భారత్ జెండా ఎగిరేలా చేసింది. అయితే మన పోరుగు దేశం పాకిస్తాన్, మాజీ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో సానియా, షోయబ్ ల వివాహం ఘనంగా జరిగింది.
Advertisement
2018 లో ఈ జంటకు బాబు కూడా పుట్టాడు. అయితే ఇప్పుడు ఈ జంట విడిపోయిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ జంట కలిసి ఉండటం లేదని, వేరువేరుగానే నివసిస్తున్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా సానియా పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా సానియా తన కొడుకు ఇజహాన్ తో ఓ పిక్ షేర్ చేసింది అందులో, ‘కష్టమైన రోజుల్లో నన్ను పొందే క్షణాలు’ అంటూ తన బిడ్డ తనను నుదుటిపై ముద్దు పెట్టే ఫోటోను సానియా తను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఇటీవలే ఇజహాన్ బర్త్ డే వేడుకలు జరిగాయి.
Advertisement
దుబాయ్ లో జరిగిన ఈ వేడుకల్లో ఇజహాన్ తో పాటు, సానియా, షోయబ్ కూడా పాల్గొన్నారు. కానీ సానియా ఈ పిక్స్ ఒక్కటి కూడా తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేయలేదు. దీంతో షోయబ్, సానియా కలిసి ఉండటం లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. వీరి మధ్య దూరం పెరిగిందని మరికొందరు అంటుంటే, బయటకు రావడం లేదు కానీ, ఏదో జరుగుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సానియా, షోయబ్ విడిపోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
read also : షారుక్ ఖాన్ ఆస్తుల విలువెంతో తెలుసా..?