Advertisement
santosham movie child artist: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వాళ్లు ఎంతోమంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇక మరికొందరు ఒకటి రెండు సినిమాలను చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. ప్రేక్షకులకు మాత్రం ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే ఆసక్తి బాగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే నాగార్జున సంతోషం సినిమాలో నాగార్జున ( కార్తీక్) కి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మీకు అందరికీ గుర్తుండే ఉంటాడు.
Advertisement
Read also: BAALU MOVIE HEROINE: పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?
2002లో కే దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అక్షయ్ బచ్చు. హిందీలో పలు సినిమాలలో నటించారు అక్షయ్. అదే సమయంలో అతడి నటన చూసి నాగార్జున సంతోషం సినిమాలో తన కొడుకుకి పాత్రలో అక్షయ్ ని తీసుకున్నారు. అక్షయ్ హిందీలో పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అలాగే హిందీలో ఎన్నో అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించాడు అక్షయ్. ఆ తర్వాత ప్రభాస్ – త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా “వర్షం”లోనూ అక్షయ్ నటించారు.
Advertisement
అంతేకాక బ్లాక్ బస్టర్ సినిమా పోకిరిని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఆయేషా టకియా తమ్ముడి పాత్రలో నటించాడు అక్షయ్. 45కు పైగా అడ్వర్టైజ్మెంట్స్ లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన చదువుపైనే దృష్టి సారించాడు. ప్రస్తుతం అక్షయ్ ముంబైలో నివసిస్తున్నాడు. ఆన్ మై కేర్ రోల్ అనే ఒక కాస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు అక్షయ్. అటు ఉద్యోగం చేస్తూనే సినిమాలలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు.
Read also: PAWAN KALYAN ON UNSTOPPABLE 2: మూడు పెళ్లిళ్లపై పవన్ కౌంటర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య





