Advertisement
Sardar Review in Telugu : హీరో కార్తీ ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్దార్”. ఇండియన్ స్పై థ్రిల్లర్ గా తిరకెక్కిన ఈ సర్దార్ సినిమాలో కార్తీ విలక్షణ పాత్రలో నటించారు. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో రాశిఖన్నా, రజిష, విజయన్ కథానాయకలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే యూఎస్ తో పాటు తమిళనాడులో పలు థియేటర్లలో ప్రీమియర్ షో లు పడ్డాయి. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Sardar Review in Telugu కథ మరియు వివరణ:
కథ విషయానికి వస్తే విజయ్ ప్రకాష్ (కార్తీ)ఒక పోలీసు అధికారి మరియు అతను మీడియా ముందు ట్రెండింగ్ లో ఉండాలి అనుకుంటూ ఉంటాడు. దానికోసం ఏదైనా చేస్తాడు కూడా అయితే, ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించకుండా పోయినప్పుడు కథ వేరే మలుపు తిరుగుతుంది. అందులో పాత సైనిక రహస్యాలు ఉన్నాయని తెలియడంతో CBI మరియు RAW వెతుకుతుంటాయి. అయితే విజయ్ ప్రకాష్ ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. అతని ఫేమ్ రావాలి అనే ఫోబియా కారణంగా అతను రా ఇంటలిజెన్స్ కంటే ముందు ఫైల్ ను కనుగొనాలని నిర్ణయించుకుంటాడు. తద్వారా అతను ఫైల్ కోసం భారతదేశమంతటా ట్రెండింగ్ అవుతానని అనుకుంటాడు. ఈ ప్రక్రియలో విజయ్ ప్రకాష్ కి తన తండ్రి సర్దార్ గురించి తెలుస్తుంది. మరియు అతని మిషన్ గురించి తెలుస్తుంది. చివరగా, విజయ్ ప్రకాష్ మిషన్ లో ఎలా భాగం అయ్యాడు మరియు మిషన్ ఏమిటి అనేది మిగిలిన కథ.
Advertisement
సర్దార్ మూవీ తీసిన మిత్రన్ దర్శకత్వ శైలి విభిన్నంగా ఉంటుంది. తొలి చిత్రం అభిమన్యుడు తోనే ఆయన ఆకట్టుకున్నాడు. బ్యాంకు మోసాలు, డిజిటల్ మోసాలను కళ్ళకు కట్టాడు. ఇప్పుడు సర్దార్ మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇదో గూఢచారి కథ. సినిమాలో ఆసక్తికర సీక్వెన్స్ తో నడిపించాడు. ఒక సైనిక రహస్యాల ఫైలు కోసం రా, సిబిఐ తో పాటు ఒక పోలీస్ వెతకడంలో పడ్డ కష్టాలు, అందులోని సస్పెన్స్ ను తెరపై చూపించాడు. కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ రసవత్తరంగా సాగితే ఫ్లాష్ బ్యాక్, సెకండ్ ఆఫ్ నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ లో మళ్ళీ ఆసక్తికరంగా మలిచాడు.
ప్లస్ పాయింట్లు:
కథ
స్క్రీన్ ప్లే
కార్తి పెర్ఫార్మన్స్
మైనస్ పాయింట్లు:
సెకండ్ హాఫ్ స్లోగా సాగే సన్నివేశాలు
తమిళ ఫ్లేవర్ తో విసుగు
Sardar Review in Telugu Ratingరేటింగ్ : 2.5/5
READ ALSO : Ori Devuda Movie Review : ఓరి దేవుడా రివ్యూ