Advertisement
Saripodhaa Sanivaaram Review: నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయికుమార్ తదితరులు ఈ సినిమాలో నటించారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సినిమాను నిర్మించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు. మురళీ జీ సినిమాటోగ్రఫి ఇచ్చారు. కథ, రివ్యూ చూసేద్దాం.
Advertisement
సినిమా: సరిపోదా శనివారం
నటీ నటులు: నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయికుమార్ తదితరులు
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫి: మురళీ జీ
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రిలీజ్ డేట్: 29-08-2024
కథ మరియు వివరణ:
చిన్ను అలియాస్ సూర్య (నాని)కి బాగా కోపం. అయితే దాన్ని కంట్రోల్ చేసేందుకు తల్లి చాయా దేవీ (అభిరామి) తనకు ఒక కండీషన్ పెడుతుంది. కేవలం వారంలో ఓ రోజు మాత్రమే కోపాన్ని చూపించమని అంటుంది. కోపం అంటే ఏంటో చెప్పాలని చాయాదేవీ ప్రయత్నిస్తుంది. కానీ తాను చనిపోతుంది. శనివారం తన కోపాన్ని ప్రదర్శించాలని సూర్య డిసైడ్ అవుతాడు. ఇది ఇలా ఉంటే సోకులపాలెంలో ఎస్సై దయానంద్ (ఎస్ జే సూర్య) ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. కోపంతో ఎవరో ఒకరిని హింసిస్తూనే ఉంటాడు. దయానంద్ కి తన అన్న ఎమ్మెల్యే కూర్మానంద్ (మురళీ శర్మ)తో ల్యాండ్ సమస్యలొస్తాయి. కూర్మానంద్ ని చంపాలని దయానంద్ అనుకుంటాడు. సూర్యని సోకులపాలెంకు కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) తీసుకు వచ్చి ఏం చేస్తుంది..? దయానంద్, సూర్యల మధ్య ఏం జరుగుతుంది..? ఇవి తెలియాలంటే మూవీ చూడాలి.
Advertisement
ఈ మూవీలో నాని తన కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చూపించడు. కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని హీరోయిజాన్ని చూపిస్తాడు. ఇలాంటి వీక్నెస్ తో ఎంతైనా ఆడుకోవచ్చు. ఇందులో అంతగా ఏం లేదు. శనివారమే కొడతాడు కదా మిగతా వారాల్లో వచ్చే హీరోని లేపిస్తే అయిపోతుంది అని లాజిక్ వెతికితే మాత్రం ఈ మూవీని చూడలేరు. తన తండ్రి ముందు కోపాన్ని అదుపు చేయడం తర్వాత హీరో మీదకి వెళ్ళమని తండ్రి చెప్పడం ఇవన్నీ రొటీన్ సినిమాలే. అలాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాని కూడా తీసుకువచ్చారు. అరిగిపోయిన సీన్లని మళ్ళీ మళ్ళీ చూపించడం వలన సినిమాకి ఏమైనా కొత్త కథను చెప్పాలన్న ప్రయత్నం చేయలేదని అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ లో హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ ని ఎక్కువగా ఊహించే రేంజ్ లో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
సెకండ్ హాఫ్ లో హీరో విలన్ మధ్య ఆట అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఎస్ జె సూర్య పాత్రకి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. టెక్నికల్ టీం ని బాగా వాడుకున్నారు కెమెరా వర్క్ చాలా గ్రేట్ గా ఉంది. సోకులపాలెం సెట్ బావుంది కానీ ఇదివరకు ఎన్నో సినిమాల్లో చూసినట్లు ఉంటుంది. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. స్క్రీన్ మీద సూర్య కనిపిస్తే ఆడియన్స్ కి ఎనర్జీ వచ్చేటట్టు చూపించారు. విలన్ గా అదరగొట్టేసారు. మురళీ శర్మ పాత్ర కొత్తగా ఉంది. మిగిలిన వారు కూడా పాత్రలకు తగ్గట్టు బానే నటించారు.
Also read:
ప్లస్ పాయింట్స్
నటీ నటులు
ఎలివేషన్స్
టెక్నీకల్ టీం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
కొన్ని సీన్లు
రేటింగ్: 3/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!