Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా భారీ అంచనాల ప్రకారం మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్ వారి పాట’ మూవీ మే 12న విడుదలై మొదటి రోజు ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
సినిమా మంచి కాన్సెప్ట్ తో తేరకెక్కడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రం టేకింగ్ విషయంలో దర్శకుడు పరశురాం చాలా తప్పులు చేశాడు.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
ఓ సందర్భంలో వాటిని కవర్ చేసుకున్నాడు కూడా! కానీ, ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యాక ఓ బ్లండర్ మిస్టేక్ ను నెటిజన్లు కనిపెట్టి అతన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అదేంటి అంటే, సినిమా సెకండ్ హాఫ్ లో ఢిల్లీ నేపథ్యంలో ఓ సీన్ ఉంటుంది. నదియా పాత్ర జైల్లో ఉన్నప్పుడు కలుసుకోవడానికి వెళ్లిన మహేష్, అక్కడికి విలన్ సముద్రఖని ని కూడా రమ్మని పిలుస్తాడు. వచ్చేటప్పుడు పళ్ళు తీసుకు రమ్మంటాడు. విలన్ మహేష్ అడిగిన పళ్ళు తీసుకొచ్చినప్పుడు వాటిని తీసుకోమని జైల్లో ఉన్న నదియాకి చెబుతాడు. కానీ ఆమె తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆమె వెళ్లిపోయింది. హనీ థియేటర్లో చూసినప్పుడు జనాలు అలా ఫిక్స్ అయ్యారు. కానీ ఓటీడీలో చూశాక నిజంగా ఆమె ఆ పళ్ళు తీసుకోవాలనుకున్న అక్కడ స్పేస్ ఉండదు.
Advertisement
దీంతో ‘మర్యాద రామన్న’ సినిమాలో సునీల్ ట్రైన్లో ఉండి కొబ్బరిబోండం తీసుకోవడానికి కష్టపడే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ, దర్శకుడు పరశురామును ట్రోల్ చేస్తున్నారు నేటిజెన్లు. అయితే దర్శకుడు థియేటర్స్ లో ఆడియన్స్ రియాక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ సీను అలా తీసినట్టు ఉంటాడు. ఆ రకంగా అయితే అతను సక్సెస్ అయినట్టే. ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు ఏ ప్రేక్షకులు కూడా ఈ సన్నివేశం గురించి కంప్లైంట్ చేయలేదు.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?