Advertisement
శ్రీకాంత్, సౌందర్య కాంబినేషన్లో నిన్నే ప్రేమిస్తా సినిమా 2000 సెప్టెంబర్ 14న రిలీజ్ అయింది ఈ సినిమాని మీరు కూడా చాలాసార్లు టీవీలో చూసే ఉంటారు. ప్రముఖ సంగీత దర్శకుడు కే చక్రవర్తి ఈ సినిమాలో సౌందర్య తండ్రిగా నటించారు. ఈ సినిమాలో బ్యాంకు ఉద్యోగిగా శ్రీకాంత్ నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే ”డబ్బు అంటే లక్ష్మి. ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంకులో. ఆ బ్యాంకు గుడి లాంటిది అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని శ్రీకాంత్ ఈ డైలాగ్ ని ప్రజల ముందుకు వెళ్లి చెప్తాడు.
Advertisement
Advertisement
అయితే ఇదే డైలాగ్ ని సర్కారు వారి పాట సినిమాలో కూడా పెట్టేసారు. ఈ సీన్ ఇక్కడి నుండి కాపీ కొట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రిఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మొదలైన వారు ఈ సినిమాల్లో నటించారు. 2022 మే 12న ఈ సినిమా రిలీజ్ అయింది. సర్కారు వారి పాట సినిమాలో కూడా శ్రీకాంత్ సినిమాలో డైలాగ్ ని పెట్టారు. ఇది కనిపెట్టిన సోషల్ మీడియా యూజర్లు ఒక ఆట ఆడేసుకుంటుంటారు. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి.
Also read: