Advertisement
ఈ మధ్యకాలంలో చాలామంది బ్యాంక్ అకౌంట్ అనేది తీస్తూ ఉన్నారు. ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో బ్యాంక్ అకౌంట్ అంటే కూడా తెలియదు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ సందర్భంగా బ్యాంకు మనకిచ్చే సర్వీసులలో ఏటీఎం సర్వీస్ కూడా ఉంది. ఈ యొక్క ఏటీఎం కార్డును ఉపయోగించి ఏటీఎం మిషన్ లో క్యాష్ విత్ డ్రా చేస్తున్న సమయంలో సెలెక్ట్ యువర్ అకౌంట్ టైప్ అని చూపిస్తూ ఉంటుంది. అవి ఏంటంటే ఒకటి సేవింగ్ అకౌంట్. రెండవది కరెంట్ అకౌంట్.రెండు కూడా వేర్వేరు అవసరాల కోసం డిజైన్ చేయబడిన అకౌంట్స్.
Advertisement
సేవింగ్ అకౌంట్:
మనం డబ్బులు దాచుకునే దాన్ని సేవింగ్స్ అకౌంట్ అని ఈ విధంగా దాచుకున్న డబ్బుపై బ్యాంక్ మనకు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్యాంకులను బట్టి వడ్డీ అనేది ఉంటుంది. ఈ విధంగా దాచుకున్న డబ్బులు మనం ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్ అకౌంట్ ను ఎవరైనా ఏ బ్యాంకు లో నైనా ఓపెన్ చేయవచ్చు. దీనికి వయసు 18 నిండి ఉండాలి. ఈ అకౌంట్ ను మినిమం కొంత బ్యాలెన్స్ తో ఓపెన్ చేసి ఆ తర్వాత కూడా ఈ మినిమం బాలన్స్ మెయింటెన్ చేయాలి. సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ బ్యాంక్ అయినా సరే ఒక పాస్ బుక్కు, ఏటీఎం కార్డు, చెక్ బుక్ ఇస్తారు.
Advertisement
కరెంట్ అకౌంట్ :
కరెంట్ అకౌంట్ అంటే తెలుగు లో ప్రస్తుత ఖాతా లేదా వాడుక ఖాతా అని అంటారు. ఈ అకౌంట్ ను వ్యాపార అవసరాల కోసం ఉపయోగిస్తారు. వ్యక్తులు, సంస్థలు, పబ్లిక్,ఎంటర్ప్రైజెస్ పేర్లతో ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ కు ఎలాంటి లిమిట్స్ ఉండవు. వ్యక్తి యొక్క లావాదేవీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది. సేవింగ్ అకౌంట్ తో పోల్చినప్పుడు కరెంట్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ ఎక్కువగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అది 10 వేల నుంచి 20 వేల వరకు కూడా ఉండవచ్చు.
ALSO READ;