Advertisement
హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చాడు. గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం నెలకొంది. ఇటీవల తన రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలోనే ఆయన దళితులను అవమానించేలా కామెంట్స్ చేసారనే ఆరోపణలున్నాయి. దీంతో ఉపేంద్ర పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు.
Advertisement
Advertisement
తాజాగా ఈఎఫ్ఐఆర్ పై స్టే ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. బెంగళూరులోని చెన్నమ్మ కేరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్ లో ఉపేంద్ర పై ఫిర్యాదు నమోదు అయింది. అయితే తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ని ఆపాలని ఫిర్యాదు నమోదైంది. అయితే తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ని ఆపాలని డిమాండ్ చేస్తూ.. ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని ఉపేంద్ర తరుపు సీనియర్ న్యాయవాది ఉదయ్ హోల్లా వాదించారు.
ఇటీవల ఉపేంద్ర సోషల్ మీడియాలో లైవ్ లో వచ్చి ప్రజా కూటమి గురించి మాట్లాడారు. ఇదే సమయంలో ఆయన ఓ సామెత కూడా చెప్పారు. విమర్శకులను ఓ వర్గంతో పోల్చుతూ.. “ ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారని.. అలాగే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసే వాళ్లు కచ్చితంగా ఉంటారని.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలపై ప్రేమాభిమానాలే నిజమైన దేశభక్తి” అని అన్నారు. దీంతో ఉపేంద్ర మాటలపై దళిత సంఘాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తన కామెంట్స్ పై క్షమాపన చెప్పారు ఉపేంద్ర.