Advertisement
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. కొంత మంది ఎదిగితే, కొంత మంది రాణించలేకపోతున్నారు. అయితే, వెబ్ మీడియా, సోషల్ మీడియా పెరిగాక, నటి నటులు ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా, కొంతమంది నటీనటులు కొన్ని సీక్రెట్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. బహుశా ఈ విషయం ఎక్కువమందికి తెలిసి ఉండదు. అలాంటి నటీనటులు ఎవరు? ఆ కాంట్రవర్సీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# రామ్ చరణ్:
హైదరాబాదులోని ఓ సిగ్నల్ వద్ద రాంచరణ్ కారు ఆగితే ఇద్దరు కుర్రాలను తన బౌన్సర్లతో కొట్టించారు అని ఆరోపణలు వచ్చాయి. అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. తర్వాత రామ్ చరణ్ వివరణ కూడా ఇచ్చాడు.
# సాయి పల్లవి:
విరాటపర్వం సినిమా ప్రమోషన్ల టైమ్ సాయి పల్లవి, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో హిందూ పండిట్లను అన్యాయంగా చంపడం చూపించారు. అలాగే లాక్ డౌన్ టైం లో ఇక్కడ గోరక్షకుల పేరుతో ఓ ముస్లింని చావగొట్టారు. అది హింస అయితే ఇది హింసే అంటూ చెప్పుకోచ్చారు. ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఏకంగా భజరంగ్ సభ్యులు హైదరాబాద్ కు వచ్చి సాయి పల్లవి పై కేసు పెట్టారు. తర్వాత ఆమె వాళ్ళకు క్షమాపణలు చెప్పడం జరిగింది.
Advertisement
# కుష్బూ:
ఈమెపై తమిళనాడులో 2005లో ఓ కేసు నమోదయింది. ఆడ, మగ పరస్పర అంగీకారంతో పెళ్లికి ముందు ### లో పాల్గొంటే తప్పులేదు. అంతమాత్రాన ఆడవారి శీలం పోయినట్టు కాదు. శీలం అనేది మనసుకు సంబంధించింది అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది. ఇవి పెద్ద వివాదానికి దారితీసాయి. ఈమె పైన కొందరు దాడి కూడా చేశారు. ఆ చర్యలను వ్యతిరేకిస్తూ కుష్బూ 40 మందిపై కేసు పెట్టింది. 2018 వరకు ఆమె విచారణకు హాజరైంది.
# నాగార్జున:
2011లో ఈ స్టార్ హీరో పై సునీత చౌదరి అనే జర్నలిస్ట్ కేసు ఫైల్ చేసింది. ఆ జర్నలిస్టు తో నాగార్జున దురుసుగా ప్రవర్తించారని, అలాగే బూతులు కూడా తిట్టాడని ఆమె కేసు పెట్టింది. ఎందుకంటే నాగార్జునపై ఆమె ప్రచురించిన స్టోరీకి నాగార్జున హార్ట్ అయ్యాడట. అందుకే ఆమెను చంపేస్తానని బ్లాక్ మెయిల్ కూడా చేశాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది.
# అల్లు అర్జున్:
2014లో అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. ఆ టైంలో అల్లు అర్జున్ ను చెక్ చేయడానికి పోలీసులు కారు అద్దం కిందికి దింపాలి అని కోరితే అందుకు అతను నిరాకరించాడు. తర్వాత పోలీసులు అతన్ని వదిలేయడం జరిగింది.
Read also: గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్ భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?