Advertisement
సాధారణంగా మధ్యతరగతి, పేద ప్రజలకు ఉన్నంత ఓపిక ఎవ్వరికీ ఉండదు. అదే ధనికులకు మాత్రం అస్సలు ఓపిక ఉండదనే చెప్పవచ్చు. కొంత మంది మధ్య తరగతి వారికి కోపం వస్తే తమ విశ్వరూపం చూపిస్తారు. హైదరాబాద్ లో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. చాలా చోట్ల ఇండ్లలోకి నీరు చేరి వరద నీటితో పాటు పాములు కూడా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఓఇంట్లోకి పాము రావడంతో.. యువకుడు చేసిన పనికి జీహెచ్ఎంసీ అధికారులే ఆశ్చర్యపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు.
Advertisement
గత కొద్ది రోజుల నుంచి వర్షం కురవడం.. అలాగే చలికి ఇంట్లో ఉండలేక, వరదలతో బయటికీ వెళ్లలేక హైదరాబాద్ నగర వాసులు అసహనంతో ఉంటే.. ఓ వ్యక్తి చాలా ప్రస్టేషన్ లో ఉన్నాడు. అల్వాల్ ప్రాంతంలో ఉన్న సంపత్ కుమార్ అనే యువకుడి ఇంట్లోకి వరద నీటితో పాటు పాము కూడా వచ్చి చేరింది. సంపత్ జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. చాలా భయంగా ఉందని.. హెల్ప్ చేయాలని కోరాడు. చిన్నపిల్లలు ఉన్నారని.. త్వరగా రావాలని ఫోన్ల మీద ఫోన్లు చేసి చాలా సేపు ఎదురుచూశాడు.
Advertisement
సంపత్ ఫిర్యాదు చేసి దాదాపు 6 గంటలు గడిచినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించలేదు. దీంతో సంపత్ కి ఓపిక నశించింది. అధికారుల కోసం ఎదురుచూడటం మానేసి.. ఆగ్రహంతో ఉన్న సంపత్ పెద్ద సాహసం చేసి ఆ పామును అయితే పట్టుకున్నాడు. ఆ పాముని తీసుకొని నేరుగా జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్ కి తీసుకొచ్చి అధికారి టేబుల్ మీద వదిలాడు. సంపత్ చేసిన పనికి అక్కడ ఏం జరుగుతుందో తెలియక అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే భయంతో పరుగులు తీశారు. ఇప్పుడు ఈ పామును మీరే పట్టుకోండి అంటూ యువకుడు వెళ్లిపోయాడు. ఇక అధికారుల నిర్లక్ష్యం పోతుందని పేర్కొన్నాడు సంపత్.