Advertisement
ఉత్తరప్రదేశ్ చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చే పుణ్య క్షేత్రాలు మధుర, కాశీ. శ్రీకృష్ణ జన్మస్థానం మధుర, కాశీ మజిలీల కథల గురించి చాలానే విషయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఈ రెండు నగరాలూ ఉన్న రాష్ట్రము లోనే ఇంతకాలం వరకు అయోధ్య కూడా ఉంది. కానీ ఈ రెండు నగరాలకు ఉన్నంత పాపులారిటీ అయోధ్యకు ఇప్పటివరకు రాలేదు. రామ జన్మ భూమి అయిన అయోధ్యను కాశీ, మధుర దర్శించడానికి వెళ్లేవారు అయోధ్యను కూడా చూడడానికి వెళ్లేవారు. కానీ, అయోధ్యకు ఇంతటి కళ వచ్చింది మాత్రం రాములోరి గుడి వచ్చిన తరువాతే. కానీ, ఇప్పటి వరకు అయోధ్య కోసం ప్రత్యేకంగా ట్రిప్ పెట్టుకున్న వారు చాలా తక్కువ.
Advertisement
Read Also: ఇన్ఫోసిస్ నారాయణ, సుధల లవ్ స్టోరీ గురించి తెలుసా? చివరకు పెళ్లి ఖర్చు కూడా?
హింల దూ, బౌద్ధ, జైన మతాలకు కేంద్ర బిందువు గా ఉన్న అయోధ్య కొన్నేళ్ల పాటు నిస్తేజంగానేన్న రవాణా కనెక్టివిటీ అయోధ్యకు ఇప్పటివరకు లేదు. ఉత్తరప్రదేశ్ కాపిటల్ లఖ్నవు కు అయోధ్య చాలా దగ్గరలోనే ఉంది. కానీ, డైరెక్ట్ గా అయోధ్య వెళ్లాలంటే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. రైల్వే స్టేషన్ కూడా చాలా పాతబడి కనిపిస్తుంది. అయోధ్యకు దగ్గర్లోనే ఆర్మీ కనెక్టివిటీలు కూడా ఉన్నాయి. కానీ కనీసం విమాన సౌకర్యం కూడా ఉండదు. ఇంత కష్టపడి అయోధ్యకు వెళితే.. అక్కడ కనీసం రెండు రోజులు ఉండడానికి హోటల్ ఫెసిలిటీ కూడా ఉండదు.
Read Also: కాల సర్ప దోషం అంటే ఏమిటి? ఇది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది?
Advertisement
సాధు జీవుల కోసం, సౌకర్యాలు పట్టింపు లేని వారి కోసం ధర్మ సాలలు, సత్రాలు మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటాయి. త్రేతాయుగం నాటి అయోధ్య ద్వాపర యుగం నాటి మధుర కంటే వెనుకబడి ఓ శాపగ్రస్త నగరంగా కనిపిస్తుంది. అయోధ్య అస్సలు అభివృద్ధి చెందని నగరంగా కనిపించడానికి కారణం సీతాదేవి శాపమే అని అక్కడ వారు చెబుతూ ఉంటారు. లంక నుంచి అయోధ్యకు తిరిగి రావడానికి సీతాదేవి అగ్ని పరీక్షనే ఎదుర్కొంది.
ఆ పరీక్షా తరువాత కూడా అక్కడి వారు సీతాదేవి గురించి నానారకాలుగా మాట్లాడడంతో అక్కడి ప్రజలపై సీతాదేవి ఆగ్రహం తెచ్చుకుందని అక్కడి వారు నమ్ముతారు. ఆ శాపం వల్లే ఉత్తరాదిన అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, అమర్‌నాథ్ వంటి పుణ్య క్షేత్రాలు వెలిగిపోతున్నా.. అయోధ్య మాత్రం అలానే ఉండిపోయింది. అయితే.. దాదాపు 496 సంవత్సరాల తరువాత, ఆరు గ్రహాలు అనుకూలించిన వేళా ప్రస్తుతం అయోధ్య రూపు రేఖలే మారిపోతున్నాయి. విమానాశ్రయాన్ని తలపించే సరికొత్త రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు నేరుగా చేరుకునే రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. అయోధ్యకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడానికి మౌలిక సదుపాయాల కోసం అక్కడి ప్రభుత్వం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.
Read also:
సాయి పల్లవి, రామ్ లక్ష్మణ్ కాకుండా.. టాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న టాలీవుడ్ ట్విన్స్ వీరే!