Advertisement
దేశం పేరు మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం విధితమే. అయితే ఈ సమావేశాల్లోనే ఇండియా పేరును భారత్‌గా మార్చే తీర్మానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యాంగం “ఇండియా, దట్ ఈజ్ భారత్” అని దేశాన్ని సంబోధిస్తోంది. అయితే దీనిని “భారత్” అని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త తీర్మానాన్ని తీసుకురానున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement
జీ20 దేశాధినేతలకు ఈ నెల 9న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. దీంతో దేశం పేరును మార్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. ఈ మేరకు వీరేంద్ర సెహ్వాగ్ మంగళవారం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో సెహ్వాగ్..”పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. మనం భారతీయులం. ఇండియా అనేది బ్రిటీషర్లు ఇచ్చిన పేరు. మన దేశం అసలైన పేరు భారత్ ను అధికారికంగా తిరిగి పొందడానికి ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. వన్డే ప్రపంచకప్ లో మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలని బీసీసీఐ ని, జైషాను కోరుతున్నాఅని తెలిపారు.