Advertisement
బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురుగా నటించి ఎంతో మంది అభిమానుల మన్ననలు పొందిన నటి ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అవికా గోర్.. బుల్లితెర సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు. దీని తర్వాత హీరోయిన్ గా “ఉయ్యాల జంపాల” అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతమైంది. ఈ విధంగా నటి అవికాగోర్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చినా కానీ మళ్లీ పుంజుకుంటుంది. ప్రస్తుతం శ్రీరామ్ తో జత కట్టి ” టెన్త్ క్లాస్ డైరీ ” అనే మూవీలో నటిస్తోంది. SR మూవీ మేకర్స్ అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్ పై,పి.రవి తేజ, అచ్యుత రామారావు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Advertisement
ఈ మూవీ జులై 1వ తేదీన థియేటర్లలోకి రానుంది. అలాగే అవికాగోర్ నాగ చైతన్య హీరోగా నటించిన “థాంక్యూ” సినిమాలో కూడా ఒక కీలక రోల్ లో చేస్తున్నట్టు తెలుస్తోంది. అవికా కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మడు రెండు సంవత్సరాల క్రితమే తన ప్రియుడు మిలిందు గురించి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.. పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్టు ఆమె చాలాసార్లు వెల్లడించారు.
Advertisement
అయితే తాజాగా “టెన్త్ క్లాస్ డైరీస్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన ప్రియుడి గురించి చెప్పింది అవికాగోర్.. నా వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తి గా ఉన్నదని, మిలిందుతో ప్రేమయానం ఇంకా బాగుందని చెప్పుకొచ్చింది. నేను బరువు తగ్గడం నుండి నిర్మాతగా మారడం వరకు, నా ప్రతి మూమెంట్లో అతను తోడునీడగా ఉంటున్నారని తెలియజేసింది. నా గురించి ప్రతి విషయం తెలుసుకొని నేను ఇంకా లైఫ్ లో ఏం చేయాలనేది తెలియజేస్తూ నాకు సపోర్ట్ గా నిలుస్తారని అన్నది. తన పరిచయం తర్వాత నాలో మరింత విశ్వాసం పెరిగిందని ఆమె తెలియజేసింది.
also read;
కాశీ పట్టణాన్ని ‘వారణాసి’ అని ఎందుకు పిలుస్తారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటి ?