Advertisement
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి తరచూ ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు దశాబ్ద కాలం గడిచినా ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. ఉదయ్ కిరణ్ గురించి చిరంజీవి గురించి ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఉదయ్ కిరణ్ చావుకి కారణం చిరంజీవి అని, డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారు ఉదయ్ కిరణ్ అంటూ ఉదయ్ కిరణ్ చనిపోయినప్పటి నుండి కూడా ప్రచారం సాగుతూనే ఉంది.
Advertisement
చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఉదయ్ కిరణ్ సూసైడ్ కి చిరంజీవి కి ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉంటారు. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత చిరంజీవి ఉదయ్ కిరణ్ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదట. కొంతమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ ద్వారా తెలియని విషయాలని పంచుకుంటూ ఉంటారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ కూడా ఉదయ్ కిరణ్ గురించి చెప్తూ ఉంటారు.
Advertisement
తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడారు. ఉదయ్ కిరణ్ అంటే సుస్మిత కి కూడా ఇష్టమే అని ఆయన చెప్పారు. చిరంజీవి కూతురు సుస్మిత ని గతంలో ఇష్టమైన హీరో ఎవరని అడిగితే ఉదయ్ కిరణ్ అని చెప్పిందట. ఇంద్ర సినిమా 100 రోజులు ఫంక్షన్ కి కూడా ఉదయ్ కిరణ్ వచ్చారట.
అప్పటికే ఉదయ్ కిరణ్ కి సుస్మిత కి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఉదయ్ కిరణ్ తన నిశ్చితార్థం బ్రేక్ చేసుకునే కొన్ని రోజుల ముందు జర్నలిస్టులకి పార్టీ ఇచ్చారట. సినిమాలకి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో చేతులారా కెరియర్ పాడయింది. ఒక మహిళా జర్నలిస్టు తో ఉదయ్ కిరణ్ ప్రేమలో ఉండడం వలన సుస్మిత తో నిశ్చితార్థం ఆగిపోయినట్లు జర్నలిస్ట్ భరద్వాజ్ చెప్పారు.
Also read: