Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదుల మధ్య వాదోప వాదనలు జరుగుతున్నాయి.
Advertisement
సుప్రీంకోర్టుకు వెళ్లితే.. కేసు వారం రోజుల పాటు వాయిదా జరిగింది. మరోవైపు ఏపీ ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు కేసు వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోయాయి.
ఇవి కూడా చదవండి: ఈసారి 175 స్థానాల్లోనూ వైసీపీ గెలిచి చూపిస్తుందా? జగన్ ధీమా వెనుక అసలు కారణం ఏంటి?
టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత రాజకీయాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు ఖండిస్తున్నారు. హై సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ ను చేయడం చాలా దారుణమని.. ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై సీ ఓటర్ సర్వే సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్టైన తరువాత ఏపీలో సీ ఓటర్ సర్వే నిర్వహించారట. ఈ విషయాన్ని ఏఎన్ఐ తన ట్వీట్ లో పేర్కొంది.
Advertisement
వీటిని కూడా చదవండి : గుడివాడలో టీడీపీ గెలుస్తుందా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
ఏఎన్ఐ చేసిన ట్వీట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2వేల మంది నమూనాను తీసుకుందట సీ ఓటర్ సర్వే. చంద్రబాబు అరెస్ట్ కాకముందు.. అరెస్ట్ తరువాత ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై సర్వే చేశారట.
ఈ సర్వేలో చంద్రబాబుకు సానుకూలంగా వచ్చిందని సమాచారం. ఏకంగా 53 శాతం మంది చంద్రబాబు అరెస్ట్ తరువాత సానుభూతి కలిసి వస్తుందని చెప్పారట. 36 శాతం మంది చంద్రబాబు అరెస్ట్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కలిసి వస్తుందని.. వెల్లడించారట.
మొత్తానికి మెజారిటీ ప్రజలు చంద్రబాబుకు కలిసొస్తుందని చెప్పడంతో వైసీపీ నేతల్లో గుబులు పుట్టిందట. మరో వైపు ఇటీవలే సీఎం జగన్ 175 సీట్లకు 175 సీట్లు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
కొంత మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని.. వారు మన వారు కాకుండా పోరని.. వారికి మాత్రం ఏదో ఒక పదవీ లభిస్తుందని చెప్పారు. మొత్తానికి సీ ఓటర్ సర్వే ద్వారా ఏపీ రాజకీయాలు మారిపోయాయని చెప్పవచ్చు.