Advertisement
ఇండస్ట్రీలో వర్గపోరు అనేది మనకు బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం ఎక్కువగానే ఉంటుందని చెబుతుంటారు.. అప్పుడప్పుడు వారికి వారే బయటపడ్డ సమయంలో ఈ కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా సక్సెస్ అయినా కానీ, అంతగా రాణించలేక పోయాడు.. ఆయన హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. ఆయన సినిమా సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై మరోసారి ఫామ్లోకి వచ్చారు.. ఈ ఎన్నికల సందర్భంలో మంచు విష్ణు ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
ప్రస్తుతం అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్నికల్లో ప్రకాష్ రాజుకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే.. వాటి గురించి మంచు విష్ణు మాట్లాడుతూ నేను మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉండాలన్న ఆలోచన లేదు కానీ ఇండస్ట్రీలో కొంత మంది పెద్దలు వచ్చి అడిగారు.. మా నాన్నను నేను సంప్రదిస్తే ఎందుకు ఇప్పుడు అని అన్నారు.. ఆ తర్వాత నీ ఇష్టం పోటీ చేయాలనిపిస్తే చెయ్ అన్నారు. అలానే ఎలక్షన్ల బరిలోకి వచ్చాను.. ఒకవేళ మా నాన్న వద్దని గట్టిగా చెప్పి ఉన్నా నేను వదులుకునే వాడిని అంతే కానీ చిరంజీవి అయినా ఆయన వెనుక దేవుడు ఉన్నా నేనైతే తగ్గను.. నాకు అందరికంటే ముందు కావాల్సింది మా నాన్న.. ఆయన మాట తప్పకుండా పాటిస్తానని అన్నారు విష్ణు..
Advertisement
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసమే విష్ణు మా ఎన్నికల్లో బరిలోకి దిగారని వార్తలు కూడా వస్తున్నాయి అనే కామెంట్స్ కు స్పందిస్తూ.. నేను పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడో వెళ్లేవాడిని.. మా నాన్న రాజ్యసభ మాజీ నెంబర్.. ప్రస్తుతం ఉన్న ఏపీ సీఎం మా బావ.. అలాగే తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ తో మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి.. ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న నేను మా ఎలక్షన్ ను నా రాజకీయ అరంగేట్రానికి వాడుకుంటాం అనుకోవడం వల్ల మూర్ఖత్వం అని అన్నారు.. ఆనాడు విష్ణు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా మంచు విష్ణు రాబోయే సినిమాలో అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం..
also read:
‘బింబిసార’ కథను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు?