Advertisement
Shaakuntalam Movie Review and Rating in Telugu: గతేడాది సస్పెన్స్ అండ్ యాక్షన్ త్రిల్లర్ “యశోద” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సమంత.. ఇప్పుడు “శాకుంతలం” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన దృశ్యకావ్యం శాకుంతలం. ఈ మూవీలో దేవ్ మోహన్ హీరో. ఇదొక పౌరాణిక ప్రేమ గాధ. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఇందులో దృశ్యంతుడు, శకుంతల ప్రేమ కథను వెండితెరపై విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు గుణశేఖర్. భారీ గ్రాఫిక్స్ హంగులతో త్రీడీలో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. మరి ఈ అద్భుత ప్రేమకావ్యం తెరపై ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది..? సమంత గుణశేఖర్ లకు విజయాన్ని అందించిందా..? లేదా..? తెలుసుకుందాం..
Advertisement
Read also: ముక్కు, ముఖం తెలీదు… లవర్ కోసం ఒంగోలు నుంచి హైదరాబాదుకు పయనం!
Shaakuntalam Movie Story: కథ మరియు వివరణ:
విశ్వామిత్రుడి తపోభంగం కోసం భూమి మీదకు వచ్చిన దేవకన్య మేనక (మధుబాల). విశ్వామిత్రుని తపస్సును భంగం చేయడానికి మేనకని ఇంద్రుడు భూలోకానికి పంపిస్తాడు. తపస్సు భంగం కావడమే కాదు.. వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటి అవుతారు. ఫలితంగా మేనక ఓ అమ్మాయికి జన్మనిస్తుంది. వారి ప్రేమకు గుర్తుగా పుట్టిన పాపను దేవలోకం తీసుకు వెళ్లలేక మేనక భూమి మీదనే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. శాకుంతలం పక్షులు ఆ పాపను కన్వ మహర్షి ( సచిన్ ఖేడేకర్ ) ఆశ్రమానికి చేరుస్తాయి. అక్కడ పాపకు శకుంతల అనే పేరు పెడతారు మహర్షి. ఓ రోజు కన్వ మహర్షి ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు ( దేవ్ మోహన్ ).. అక్కడ శకుంతల (సమంత) ను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా మహారాజు ప్రేమలో పడిపోతుంది. ఇద్దరూ గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. కొన్నాళ్లకు దృశ్యంతుడు తన రాజ్యానికి వెళుతూ త్వరలో తిరిగి వస్తానని.. పట్ట మహిషిగా ప్రజలకు పరిచయం చేస్తానని శకుంతలకు మాటిస్తాడు. తమ ప్రేమకు గుర్తుగా శకుంతలకు ఉంగరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు శకుంతల గర్భవతి అవుతుంది. కానీ ఎంతకూ దుష్యంతుడు రాకపోవడంతో అతని దగ్గరికి వెళుతుంది. కన్వ మహర్షి ఆశ్రమానికి తాను వెళ్లిన విషయం గుర్తు ఉంది కానీ శకుంతల ఎవరో తనకు తెలియదని అంటాడు దుష్యంత మహారాజు. అతను అలా ఎందుకు చెప్పాడు..? నిండు సభలో శకుంతలకు జరిగిన అవమానం ఏంటి..? ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Advertisement
ఈ చిత్రం గురించి చెప్పాలంటే సింపుల్ గా ఒక అందమైన ప్రేమ కథ. కాకపోతే అందులో చిన్న చిన్న ట్విస్టులు మాత్రమే ఉంటాయి. దీన్ని డైరెక్టర్ గుణశేఖర్ చాలా నీట్ గా తెరక్కెక్కించారు. కానీ దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ కథలో, సన్నివేశాలలో బలం కంటే హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరితే సినిమా హిట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ అది కుదరలేదు. దాంతో సీరియల్ సాగినట్లు సన్నివేశాలు సాగాయి. ఇక దుష్యంతుడు, శకుంతల ఎదురుపడే సన్నివేశం చాలా బాగుంటుంది. అలాగే మధ్యలో చూపించిన అసుర జాతితో దుష్యంతుడి పోరాటం, దుర్వాసుడి పాత్రకు సంబంధించిన ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక చివరలో చూపించే అల్లు అర్హ ఎంట్రీ, ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. శకుంతల పాత్రలో సమంత పర్ఫామెన్స్ పరంగా ఒదిగిపోయే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఎందుకనో అది నప్పలేదనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక దుర్వాసుడిగా మోహన్ బాబు కొద్దిసేపు కనిపించినప్పటికీ తనదైన మార్క్ నటనతో ఆయన ఆకట్టుకున్నారు. మణిశర్మ స్వరాలు మధ్య మధ్యలో మనసుకు ఊరట కలిగించాయి. థియేటర్లో చివరివరకు కూర్చోవాలంటే చాలా ఓపిక కావాల్సిందే. మొత్తంగా శకుంతల – దుష్యంతుల ప్రేమ కథను తెరపై ఓ అద్భుత దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో గుణశేఖర్ ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి.
Shaakuntalam Review Telugu ప్లస్ పాయింట్స్ :
సమంత నటన
మణిశర్మ సంగీతం
ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
సాగదీత సన్నివేశాలు
సంఘర్షణ లేని ప్రేమ
గ్రాఫిక్స్ తేలిపోవడం
రేటింగ్: 1.5/ 5