Advertisement
మన టాలీవుడ్ లో చాలామంది గొప్పదర్శకులు ఉన్నారు. వాళ్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకరు. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్లో తప్పకుండా ప్రసారం అయ్యే సినిమా ఏదైనా ఉందంటే అది ఖడ్గం మాత్రమే. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, ప్రకాష్ రాజ్ ముస్లిం పాత్రలో, రవితేజ సినిమా నటుడిగా ముఖ్యపాత్రలలో నటించారు. అలాగే ఈ చిత్రంలో మరొక ముఖ్యపాత్ర షఫీ తీవ్రవాదిగా నటించిన అజార్ పాత్ర.
Advertisement
Read also: యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..
Advertisement
ఈ చిత్రంలో అజార్ పాత్రతో 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు షఫీ. ఈ చిత్రం ఘనవిజయాన్ని నమోదు చేయడంతో షఫీ కి మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు ఈ చిత్రం తర్వాత చాలా సినిమాలలో నటించినప్పటికీ ప్రభాస్ చత్రపతి, మహేష్ బాబు ఖలేజా చిత్రంలో అద్భుతంగా నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు షఫీ. అయితే షఫీ ఏ సినిమాలో నటించినా తన పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందో అని మాత్రమే చూసుకుని నటిస్తూ ఉండడంతో ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదు. షఫీ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా ఒక సినిమాలో హీరోగా కూడా నటించారు. హీరోయిన్ నందిత దాస్ నటించిన కమిలి అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించారు.
షఫీ ఇప్పటివరకు తన కెరీర్ లో 50 పైగా చిత్రాలలో నటించారు. అయితే ఖడ్గం సినిమాలో అజార్ పాత్రకి ప్రాణం పోయడం కోసం చార్మినార్ వీధుల్లో తన స్నేహితుడి ఇంట్లో ఒక నెల రోజులపాటు ఉండి అక్కడ వారి అలవాట్లను బాగా అర్థం చేసుకున్న తర్వాత ఖడ్గం సినిమాలో నటించాడట. నిజంగా ఒక నటుడు ఓ పాత్ర కోసం ఇలా చేయడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అందుకే ఈ చిత్రంలో అజార్ పాత్ర బాగా క్లిక్ అయింది. ఇక షఫీ గత కొంతకాలంగా సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో మాత్రం ఓ కీలక పాత్రలో నటించి అలరించాడు.