Advertisement
క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న గేమ్. ఈ గేమ్ కోసం ప్రపంచ దేశాల జట్లు పోటీ పడుతూ ఉంటాయి. అయితే.. ఇది నిజంగానే జెంటిల్ మెన్ గేమ్. ఇందులో కొట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు ఎప్పుడో ఒక్కసారి కనిపిస్తూ ఉంటాయి. ఆటగాళ్లు అందరు జెంటిల్ గానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా గట్టిగా కోపం వచ్చినా, అరిచినా అదో పెద్ద న్యూస్ లో వైరల్ అయ్యి.. దానిపై డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే.. ఇలాంటి బాపతుకి చెందిన ఆటగాడే షకీబ్ అల్ హసన్. ఇతను బంగ్లాదేశ్ జట్టుకి గుండెకాయ లాంటి వాడు.
Advertisement
వారి జట్టులో ఇతను అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తి. ఆ విషయం ప్రపంచ దేశాల జట్లు ఎప్పుడో గుర్తించాయి. అయితే.. అతనికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే.. ముక్కు మీద కోపం. ఇతనికి కోపం ఎప్పుడు చుట్టూ వైఫై లాగానే తిరుగుతూ ఉంటుంది. ఇతనికి ఎంత టాలెంట్ ఉందొ.. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. అదే రేంజ్ లో బాడ్ బాయ్ ఇమేజ్ ని కూడా తెచ్చుకున్నాడు. వరల్డ్ కప్ పోరు లో భాగంగా శ్రీలంక జట్టుపై షకీబ్ తీరు కారణంగా మరోసారి ఇతను విమర్శలపాలు అయ్యాడు.
Advertisement
ఎంత పోటీ ఉన్నా ప్రత్యర్థి ఆటగాళ్ల విషయంలో స్పోర్టివ్ గానే ఉండాలి. గతంలో ఇయాన్ బెల్ రూల్స్ ప్రకారం అవుట్ అయ్యిన సమయంలో అప్పటి ధోని టీం తమ అప్పీల్ ను వెనక్కి తీసుకుంటూ అతన్ని మళ్ళీ బాటింగ్ చేయడానికి వెనక్కి పిలిచింది. అప్పట్లో అందరు ఇండియా జట్టుకి ఫిదా అయ్యారు. ఇటువంటి క్రీడాస్ఫూర్తిని చూపించడంలో ఈ సారి బంగ్లాదేశ్ జట్టు షకీబ్ కారణంగా విఫలం అయ్యింది. మాథ్యూస్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా టైం అవుట్ కారణంగా అవుట్ అయ్యాడు. అతని హెల్మెట్ విరిగిపోవడంతో రీప్లేసెమెంట్ హెల్మెట్ తెచ్చుకోవడానికి మూడు నిమిషాల సమయం పట్టింది. నిజానికి రెండు నిమిషాల సమయంలోనే బ్యాటర్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. కానీ, బంగ్లాదేశ్ జట్టు క్రీడాస్ఫూర్తిని చూపకుండా టైం అవుట్ గా ప్రకటించాలి అంటూ అప్పీల్ చేయడంతో అంపైర్లు కూడా అవుట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా చకచకా జరిగిపోవడంతో మాథ్యూస్ క్రీజ్ ని వీడాల్సి వచ్చింది.
Read More:
బండి సంజయ్ కు సొంతిల్లు కూడా లేదు.. కానీ ఆ మంత్రికి మాత్రం పెరిగిన 58 శాతం ఆస్తులు..!