Advertisement
Shakuntalam Movie Review: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత శాకుంతలం మూవీ బజ్ నడుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి గుణశేఖర్ ,దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. పురాతన మహాభారత ఇతిహాసం నుండి భరతుని అంకానికి ముందు జరిగిన సంఘటనను, ఆధారంగా దుశ్శంత మహారాజు శాకుంతల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్య దాంపత్యం గురించి ఇదివరకు ఎలాంటి సినిమాలు రాలేదు. దీన్ని గమనించిన గుణశేఖర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి భారీ బడ్జెట్ డ్రీమ్ ప్రాజెక్టు నిర్మించారు.. అయితే ఈ ప్రాజెక్టు కరోనాకు ముందే చేయాలి కానీ లాక్ డౌన్ వల్ల రెండు సంవత్సరాల పాటు సినీ ప్రపంచం స్తంభించింది.
Advertisement
also read: రేణు ఆ ఒక్క మాట చెబితే.. పవన్ జైల్లో ఉండేవారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్..!!
Advertisement
కరోనా తగ్గగానే సమంత ఆరోగ్యం క్షీణించింది. దీనివల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎన్ని అవంతరాలు వచ్చినా సినిమాను మాత్రం పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 2d 3d వెర్షన్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కానీ టికెట్స్ అంతగా అమ్ముడు పోవడం లేదట. సమంత యశోద సినిమాతో పోలిస్తే పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఓపెనింగ్స్ రావాలంటే ఖచ్చితంగా అద్భుతమైన టాక్ రావాల్సిందే అని చిత్ర యూనిట్ భావిస్తోంది.
also read:పబ్లిక్ టాయిలెట్ల డోర్ల కింది భాగంలో ఖాళీగా ఎందుకు ఉంచుతారో తెలుసా..?
ప్రస్తుతం సెన్సార్ బోర్డు వారు ఈ ఈ సినిమాకి పాజిటివ్ గా టాక్ ఇచ్చారు. గ్రాఫిక్స్ పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పారట. చరిత్రను ఎక్కడ కూడా వక్రీకరించకుండా చక్కగా తీశారని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను మెచ్చుకున్నారట. ఇక సమంత కూడా నటనతో అదరగొడుతుందని, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించిందని ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెడతారని పాజిటివ్ టాక్ అందించారట. మరి ఏప్రిల్ 14న విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.
also read: తాడిపత్రి గడ్డపై లోకేష్.. పోలీసులకే ఝలక్!