Advertisement
దేవర విడుదలపై అయోమయం నెలకొంది. దేవర సినిమాపై దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ సంచలనగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారింది ఈ సినిమాతో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంకతో ఇంటర్వ్యూ కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు.
Advertisement
తమిళనాడులో సైతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు. సినిమా ట్రైలర్ ని తాజాగా విడుదల చేయడం జరిగింది తెలుగులో సైతం యంగ్ హీరోలతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ నవల నుంచి కాపీ చేశారు అనే కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. తను హక్కులు పొందిన ఒక ప్రముఖ నవల లోనే సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని శంకర్ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Advertisement
Also read:
లేటెస్ట్ సినిమా ట్రైలర్ లో ఓ ప్రముఖమైన సీన్ వాడారని.. అది చూసి చాలా బాధేస్తోందని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వెంకటేశం రాసిన నవల నుంచి అనుమతి లేకుండా అందులో సన్నివేశాలని వినియోగించడం చూసి షాక్ అయ్యాను అని చెప్పారు. ఏ సినిమా అనేది శంకర్ క్లారిటీ ఇవ్వలేదు. దేవర సినిమా గురించి అని అందరూ అనుకుంటున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఎదురు చూడండి!