Advertisement
శార్దూల్ ఠాకూర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా మిథాలీ పారుల్కర్ తో ప్రేమలో ఉన్న శార్దూల్ ఠాకూర్, పెద్దల సమక్షంలో ఈ నెల 27న ఆమెని వివాహం చేసుకోబోతున్నారు. మహారాష్ట్రలోని కర్జత్ లో శనివారం నుంచి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హల్దీ సెలబ్రేషన్స్ లో శార్దూల్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ వేస్తూ కనిపించాడు.
Advertisement
వాస్తవానికి శార్దూల్ ఠాకూర్ మితాలీ పారూల్కర్ కి 21 నవంబర్ లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ తర్వాత వివిధ కారణాలతో వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం భారత్ గడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ని భారత జట్టు ఆడుతుండగా, ఈ టెస్ట్ టీం లోకి శార్దూల్ ఠాకూర్ ఎంపికవలేదు. అయితే మార్చి 17 నుంచి భారత ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
Advertisement
కాగా, శార్దుల్ ఠాకూర్ వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిధుల్ని ఆహ్వానించారట. ఓవరాల్ గా వివాహ వేదిక వద్ద 200 మంది వరకు కుటుంబ సభ్యులు, అతిధులు ఉన్నట్లు తెలుస్తోంది. శార్దూల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్న మిథాలి పారూల్కర్ గతంలో మోడలింగ్ చేసింది. ఇప్పుడు థానేలో స్టార్టప్ కంపెనీని రన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
READ ALSO : కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!