Advertisement
జగన్ మీద షర్మిల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయారని, ఏపీ సీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ కోసం నేను 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, సొంత లాభం కోసం కూడా చూసుకోకుండా ఏది అడిగితే అది చేశాను అని షర్మిల అన్నారు. కానీ జగన్ మాత్రం రాష్ట్రాన్ని బిజెపికి బానిస చేశారని అన్నారు. వైయస్ వారసులు అని చెప్పుకుంటే సరిపోదని, ప్రజల కోసం కూడా పనిచేయాలని విమర్శించారు షర్మిల.
Advertisement
Advertisement
నా కుటుంబాన్ని రెండుగా చీల్చింది, రాష్ట్రాన్ని చీల్చింది జగన్ అని అన్నారు. రాష్ట్రాన్ని షర్మిల రెండుగా చీల్చింది, కుటుంబాన్ని చీల్చింది. దేవుడే గుణపాఠం చెప్తాడు అని జగన్ అన్న మాటలు పై షర్మిల స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందకుండా, ఈ స్థితిలో ఉండడానికి కారణం ఐదేళ్ల పరిపాలనలో ఉన్న చంద్రబాబు తర్వాత జగనన్న అన్ని షర్మిల అన్నారు. జగనన్న చేతులారా రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని చీల్చారని షర్మిల అన్నారు. దీనికి సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ అని అన్నారు. నా యావత్ కుటుంబం కూడా దీనికి సాక్ష్యం అని షర్మిల అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!