Advertisement
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ సుపరిచితమే. ఆమె తనయుడు వై ఎస్ రాజారెడ్డి త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి. పై చదువుల కోసం రాజారెడ్డి అమెరికా వెళ్లిన సంగతి విదితమే. ఆ సమయంలోనే ఆయనకు ప్రియా అట్లూరి అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. త్వరలోనే వారిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.
Advertisement
ఈ వార్తలు వైరల్ అవుతుండడంతో.. నెటిజన్స్ అందరూ ప్రియా అట్లూరి ఎవరు? ఆమె నేసథ్యం ఏమిటి? అన్న విషయమై గూగుల్ లో తెగ వెతికేస్తున్నారట. ఇంతకీ ప్రియా అట్లూరి ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆమె ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఆమెకు యూ ఎస్ పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చట్నీస్ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట ప్రసాద్ గారి మనవరాలే ఈ అమ్మాయని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా అట్లూరితో రాజారెడ్డికి మొదటిసారిగా చర్చిలో పరిచయం అయినట్లు తెలుస్తోంది.
Advertisement
గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరి ప్రేమకి ఇటు షర్మిల-అనిల్ దంపతులు గాని, అటు ప్రియా అట్లూరి ఫామిలీ కానీ అభ్యంతరం చెప్పలేదట. రెండు వైపులా కుటుంబాలు ఒప్పుకోవడంతో వచ్చే ఏడాది మే లో వీరి వివాహం జరగనున్నది అని తెలుస్తోంది. వీరిద్దరి కులాంతర వివాహం కానున్నది. అలా అనుకుంటే షర్మిల, అనిల్ లది కూడా కులాంతర వివాహమే. అనిల్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. రాజా రెడ్డి యూ ఎస్ లోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ని పూర్తి చేసారు. ఈ కాన్వకేషన్ కు షర్మిల-అనిల్ లు రాజారెడ్డితో కలిసి వెళ్ళినపుడు తీసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
Read More:
బీ ఆర్ ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవేనా ? ఈ 5 తప్పులే కొంపముంచాయి ?
సినిమా రీమేక్ కాదు అన్నారు కదా ప్రశాంత్ నీల్ ? మరి ఈ కన్ఫ్యూషన్ ఏంటి ?
ఒకరు సీఎం, మరొకరు కాబోయే సీఎం ఈ ఇద్దరినీ ఓడించిన ఈయన ఎవరో తెలుసా ?