Advertisement
వైయస్ షర్మిల ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతోంది. కాంగ్రెస్ లో చేరడం వలన తన పార్టీ విలీనం ద్వారా రాజకీయంలో బాగుంటుందని.. రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు. డీకే శివకుమార్ రాయబారం డైరెక్ట్ సోనియా రాహుల్ తో మంతనాలు కొనసాగాయి. షర్మిల కి ఆమోదం మాత్రం దక్కలేదు. షర్మిల ఇక పార్టీతో విలీనానికి బ్రేక్ చెప్పేసారు సొంతంగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ తెలంగాణలో షర్మిల పార్టీని మొదలుపెట్టారు. అయితే పార్టీ నిర్మాణంలో మాత్రం ఎలాంటి విజయం దక్కలేదు.
Advertisement
కొద్ది నెలలుగా ఆమె కాంగ్రెస్ లో చేరడం, పార్టీ విలీనం పైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారం అంతటిలో కూడా కీలకంగా వ్యవహరించారు. రేవంత్ తో సహా పలువురు తెలంగాణలో షర్మిల కి ప్రాధాన్యతను వ్యతిరేకించారు. కేవలం ఏపీకి పరిమితం చేయాలని చెప్పారు. అయితే షర్మిల మాత్రం తాను తెలంగాణలోనే పనిచేస్తానని చెప్పేశారు. సోనియా, రాహుల్ తోను చర్చలు జరిపినా కూడా ఫలితం లేదు. షర్మిల తనకి పాలేరు సీటు ఇవ్వాలని పట్టుబట్టారు.
Advertisement
అందుకనే కాంగ్రెస్ నాయకత్వం నో చెప్పినట్లు తెలుస్తోంది. అనుచర వర్గానికి సంబంధించి ఎలాంటి హామీ కూడా దక్కలేదు. సెప్టెంబర్ 30 దాకా కాంగ్రెస్ కి షర్మిల డెడ్లైన్ విధించడంతో వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగి డీల్ ప్రతిపాదించారు. రెండు రోజులుగా ఢిల్లీలోనే షర్మిల వుంటున్నారు. కాంగ్రెస్ నుండి మాత్రం ఎలాంటి జవాబు రాలేదు దీంతో ఈమె కాంగ్రెస్ తో విలీనం ప్రక్రియకి బ్రేక్ చెప్పడం జరిగింది. ఒంటరి పోరుకు సిద్ధమైంది షర్మిల. షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నియోజకవర్గమైన పాలేరు అసెంబ్లీ నుండి బరిలోకి దిగారు ఇప్పటికే పార్టీ ఆఫీసుని విగ్రహాన్ని కూడా ప్రారంభించారు. మరి రాజకీయాల్లో ఈమె భవిష్యత్తు ఎలా ఉండనుంది అనేది చూడాలి.
Also read: