Advertisement
Dunki Movie Review : షారుక్ ఖాన్, తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ తదితరులు ఈ సినిమాలో నటించారు. రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. గౌరీఖాన్, రాజ్ కుమార్ హిరానీ, జ్యోతి దేశ్ పాండే సినిమాను నిర్మించారు. సి.కె.మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ సినిమాటోగ్రఫీ ని అందించారు.
Advertisement
నటీ నటులు: షారుక్ ఖాన్, తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ
దర్శకుడు: రాజ్ కుమార్ హిరానీ
నిర్మాతలు: గౌరీఖాన్, రాజ్ కుమార్ హిరానీ, జ్యోతి దేశ్ పాండే
సంగీతం: ప్రీతమ్, అమన్ పంత్
సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
విడుదల తేదీ: డిసెంబర్ 21, 2023
కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వచ్చేస్తే మూవీ స్టోరీ అంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ (షారుక్) ని ఒక వ్యక్తి కాపాడడం జరుగుతుంది కొన్నాళ్ళకి అతన్ని కలవడానికి హార్ది పంజాబ్ కి వస్తాడు అప్పటికి అతను చనిపోతాడు. తర్వాత అతని సోదరి కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది అప్పులు కట్టలేక ఇల్లు కూడా అమ్మేస్తుంది లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి అమ్ముకున్న ఇంటిని మళ్ళీ కొనాలని ఆమె కల. తన స్నేహితులు బొగ్గు, బల్లి కూడా డబ్బు సంపాదించడానికి లండన్ వెళ్లాలని అనుకుంటారు. వీసా కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
Advertisement
హార్ది తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని మను ని లండన్ పంపడానికి హెల్ప్ చేస్తాడు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ లో ఈ నలుగురికి సుఖీ (విక్కీ కౌశల్) పరిచయమవుతాడు. తన ప్రియురాలు జెస్సిని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలని అనుకుంటాడు. వీళ్లంతా లీగల్ గా ఇంగ్లాండ్ కి వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి దీంతో దేశ సరిహద్దులు గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని అనుకుంటారు. తర్వాత ఏం జరిగింది..? పడ్డ కష్టాలేంటి వీళ్ళకి ఎదురైనా సమస్యలు ఏంటి…? ఆఖరికి సుఖీ కల నెరవేరిందా..? లేదా..? మన్నుతో ప్రేమలో పడిన హార్డీ తిరిగి ఇండియాకి ఎందుకు వచ్చాడు..? మన్ను తిరిగి ఇండియా ఎందుకు రావాలని అనుకుంది హర్దీ సహాయం చేశాడా..? ప్రేమకథ సంగతేంటి ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి.
ఎమోషనల్ యాంగిల్ లో సినిమాని చాలా అద్భుతంగా చూపించాడు దర్శకుడు ఈ సినిమాలో మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. సినిమాని బాగా తెర మీదకి తీసుకువచ్చారు భావోద్వేగాలని ప్రేక్షకులు ఫీలయ్యే విధంగా చూపించడంలో మాత్రం విఫలమయ్యారు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. కానీ అవి ఆకట్టుకోలేకపోయాయి. మొదటి పార్ట్ సరదాగా ఉంటుంది కామెడీ కూడా బాగుంటుంది సెకండ్ హాఫ్ మాత్రం సీరియస్ గా ఉంటుంది కొంచెం కథని సాగదీసినట్లుగా అనిపిస్తుంది. నటీనటులు మాత్రం అద్భుతంగా నటించారు కామెడీని కూడా బాగా పండించారు.
ప్లస్ పాయింట్స్ :
నటీ నటులు
కథ
కామెడీ
మైనస్ పాయింట్స్:
సీరియస్ గా వుండే సెకండ్ హాఫ్
పెద్దగా వర్క్ అవుట్ అవ్వని ఎమోషన్స్
సాగదీత సన్నివేశాలు
రేటింగ్ : 2.5/5