Advertisement
ప్రపంచంలో మానవులు తిండి తినకుండా బ్రతకడం చాలా కష్టం అనే చెప్పాలి. అందుకోసమే రోజు ఏదో ఒక ఆహారాన్ని తీసుకుంటుంటారు. మరోవైపు కొందరూ ఆహార ప్రియులు కూడా ఉంటారు. తమకు ఇష్టమైన తిండి కోసం ఎంతకు అయినా తెగిస్తారు. నచ్చిన ఆహారం కోసం నానా తంటాలు పడుతుంటారు. మరికొందరూ మనుషులు వారి ఆహారశైలితో వింత పదార్థాలను సేకరిస్తుంటారు. ఉదాహరణకు కొందరికీ మట్టి తినే అలవాటు.. మరికొందరికీ బలపాలు, చాక్ పీస్, గోధుమపిండి, పాములు, క్రిమి కీటకాలు ఇలా వింత ఆహారాలను భుజిస్తుంటారు. ఇక్కడ ఓ మహిళ వింత ఆహారాన్ని తింటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళ తినే ఆహారం పేరు వింటే మీకు వాంతులు రావడం మాత్రం ఖాయం.
Advertisement
Advertisement
ఇంతకు ఆమె తింటుందంటే.. తను పెంచుకునే పెంపుడు పిల్లుల వెంట్రుకలను తింటుంది. ఈ మహిళ పేరు లిసా. కేవలం అవి తినడానికి మాత్రమే ఇష్టపడతానని చెప్పింది. పిల్లి వెంట్రుకలను తినడం వల్ల ప్రమాదమని తెలిసినప్పటికీ.. వాటినే తింటుంది. దీంతో ఆ మహిళకు అల్సర్ వచ్చే ప్రమాదముంది. అంతేకాదు.. కడుపులో ఇతర రోగాలు కూడా వచ్చే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవలే ఓ షోలో ఆమె మాట్లాడుతూ.. నేను పిల్లి వెంట్రుకలను తింటున్నానని.. 10 ఏళ్ల క్రితం తనకు ఒకే పిల్లి ఉండేదని.. ఇప్పుడు 5 ఉన్నాయని తెలిపింది. పిల్లులను తడిపి వాటి వెంట్రుకలు తింటున్నప్పుడు చాలా మృదువుగా ఉంటుందని పేర్కొంది. అయితే కొన్ని నివేదికలు మాత్రం.. లిసాకు పిల్లలు లేరని.. అలాంటి పరిస్థితిలో ఆమె పిల్లులను తన పిల్లలుగా భావించి ప్రేమిస్తుంది. లిసా ఈ వింత వ్యసనం గురించి తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.