Advertisement
రాజకీయాల్లో ఫుల్ ఫాంలో ఉన్న వ్యక్తి.. రేపో మాపో మంత్రో, ముఖ్యమంత్రో అవుతుండగా నేను మీ కుమారుడ్ని అంటూ షాకిచ్చే సన్నివేశాలు తెలుగు సినిమాల్లో చాలానే వచ్చాయి. అయితే.. ఇది రియల్ లైఫ్ లో కూడా జరిగింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం దీన్ని అనుభవిస్తున్నారు. శివచరణ్ రెడ్డి అనే యువకుడు చంద్రశేఖర్ రెడ్డి తనకు తండ్రి అవుతాడని బాంబ్ పేల్చడంతో వివాదం మొదలైంది.
Advertisement
తనను కుమారుడిగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి శివచరణ్ బహిరంగ లేఖ రాశాడు. లేఖతోపాటు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమను 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో వాపోయాడు శివచరణ్ రెడ్డి. తనకు కుమారుడే లేడని మేకపాటి ఇటీవల చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా శివచరణ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. నీకు కొడుకు లేకపోతే.. నేను ఎవరిని? అని ప్రశ్నించాడు. చదువుకు ఫీజులు చెల్లిస్తే నీ బాధ్యత తీరిపోతుందా? అని ప్రశ్నించాడు.
Advertisement
తన తల్లి తర్వాత పరిచయమైన ఆమెను భార్యగా సమాజానికి పరిచయం చేశాడని శివచరణ్ మండిపడ్డాడు. అయితే.. తనపై శివచరణ్ చేసిన ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే. అందులో ఎలాంటి వాస్తవమూ లేదన్నారు. ఇదంతా పెద్ద బోగస్ అంటూ తీవ్రంగా ఖండించారు. తనకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. శివచరణ్ రెడ్డి తండ్రి వెంకట కొండారెడ్డి అని తెలిపారు. అతని తల్లితో కలిసి శివచరణ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వెల్లడించారు.
రాజకీయంగా తనను నేరుగా ఎదుర్కోవాలని.. ఇలాంటి డొంక తిరుగుడు మనుషులు, గాలి బ్యాచ్ తో ఆరోపణలు చేయించడం సరిగ్గా లేదన్నారు ఎమ్మెల్యే. వ్యక్తిగతంగా తనపై బురద జల్లితే ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. తనకు ఇద్దరు భార్యలని.. వారికి ఒక్కొక్కరికి ఒక ఆడబిడ్డ మాత్రమేనని వివరించారు.