Advertisement
మాజీ సీఎం జగన్ సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. ఇన్ని రోజులు మినహాయింపులు దక్కించుకున్న జగన్ అధికారం నుండి కోల్పోయేసరికి ఆ చాన్స్ లేకుండా పోయింది. విదేశీ పర్యటన కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. జగన్ లండన్ కి వెళ్లేందుకు అనుమతి అడిగారు. లండన్ లో చదువుతున్న తన కూతుర్ని కలిసి ఎందుకు వెళ్లాలని విన్నవించుకున్నారు. దానిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వద్దని సూచించింది. జగన్ అక్రమస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్న సంగతి మనకి తెలిసిందే.
Advertisement
2019 సీఎం అయ్యేదాకా అయన ప్రతి శుక్రవారం కోర్టులో జరిగే విచారణకు హాజరయ్యే వారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు హాజరు నుంచి మినహాయింపు లభించింది. జగన్ విదేశాలకు వెళ్తే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. అయితే జగన్ లండన్ లో తన కూతుర్ని కలిసేందుకు వెళ్లడానికి అనుమతి అడిగారు. ఆయన నమోదైన అక్రమస్తుల కేసు విచారణ ఇంకా పెండింగ్లో ఉందని కేసు విచారణ ఆలస్యం అవుతుందని సీబీఐ కోర్టుకు చెప్పింది.
Advertisement
Also read:
వాదనలు విన్న సీబీఐ కోర్టు ఈ నెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది. దీంతో జగన్ కి కొత్త టెన్షన్ మొదలైంది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతిస్తుందా లేదంటే ఇవ్వదానే అనుమానం మొదలైంది. ఇప్పటికే జగన్ అక్రమస్తుల కేసులో దర్యాప్తులో జరుగుతున్న జాప్యం ప్రత్యేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటికే విచారణ సైతం జరుగుతోంది సరిగా ఇదే సమయంలో అదే అంశాన్ని లేవనెత్తి జగన్ విదేశాలకు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుండడం విశేషం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!