Advertisement
పరీక్షలు అంటే ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. చిన్నపిల్లలు పరీక్షలు రాసేటప్పుడు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఒక్కోసారి తెలియని ప్రశ్న వస్తే ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు కొంత మంది సినిమా కథలు కూడా రాస్తూ ఉంటారు. ఏకంగా టీచర్లకు షాక్ ఇస్తూ ఉండే ఆన్సర్ లు కూడా ఇస్తూ ఉంటారు. తాజాగా నెట్టింట ఒక ఆణిముత్యం రాసిన ఆన్సర్ వైరల్ అవుతోంది. అది చూసిన వాళ్ళందరూ కూడా అస్సలు నవ్వాపుకోలేకపోతున్నారు.
Advertisement
గుండెకి సంబంధించిన ప్రశ్న వచ్చింది ఇక అంతే ఒక ఆణిముత్యం అందరూ నవ్వేలా సమాధానం ఇచ్చాడు. గుండె బొమ్మ గీయడమే కాకుండా అందులో ప్రియా, హరిత, పూజా, నమిత ఇలా అమ్మాయిల పేర్లు రాసి వివరించాడు. ప్రియ అనే అమ్మాయి తన ఇంస్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తుందని ఆ అమ్మాయి అంటే తనకి ఇష్టమని రాసాడు. రూపా స్నాప్ చాట్ లో మెసేజ్లు చేస్తుందని అందంగా ఉంటుందని తెలిపాడు.
Also read:
Also read:
నమిత తన పొరుగు ఇంట్లో ఉంటుందని జుట్టు ఒత్తుగా పొడుగ్గా కళ్ళు పెద్దవిగా ఉంటాయని రాసుకోచ్చాడు. పూజ తన మాజీ ప్రేయసి అని ఆమెను మర్చిపోలేకపోతున్నానని ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇక చివరిగా హరిత తన క్లాస్మేట్ అని రాశాడు. ఈ ఆన్సర్ పేపర్ చూసిన టీచర్ ఫీజులు ఎగిరిపోయి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నచ్చిన వైరల్ కమారింది కోట్లలో వ్యూస్ వచ్చాయి. లక్షల్లో లైకులు వచ్చాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!