Advertisement
సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు ప్రజలందరిని శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఆయన ఇక లేరు అనే మాటను ఇంకా ఎవరు నమ్మలేకపోతున్నారు. సాహసానికి చిరునామాగా, తెలుగు సినీ కళామాతల్లి ముద్దుబిడ్డగా, చిత్ర పరిశ్రమ మూల స్తంభాల్లో ఒకటిగా నిలిచిన, ప్రేక్షకాభిమానుల మనసులు గెలిచిన కృష్ణ మరణంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
Advertisement
గుండెపోటు, ఆర్గాన్ డ్యామేజ్ వంటి సమస్యల కారణంగా కృష్ణ మరణించారు. అయితే ఎక్మో విధానాన్ని వాడి ఉంటే కృష్ణ గారిని కాపాడుకునే అవకాశం ఉందట. కానీ ఆయన కుటుంబం ఆ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనే డౌట్ అందరికీ రావచ్చు. ఎక్మో అంటే ఎక్స్ ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజేషన్ అంటారు. ఈ విధానం ద్వారానే కృష్ణాను కాపాడుకునే అవకాశం ఉంది. కానీ ఇదంతా తేలికైనది కాదు. దీనిని చేసే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈ విధానానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ విధానాన్ని అమలు చేయాలంటే మనిషి ముందు కాస్త శారీరకంగా దృఢంగా ఉండాలి. కానీ కృష్ణ గారు అంతా బలంగా లేరు.
Advertisement
అంతేకాదు ఈ విధానాన్ని ఫాలో అయ్యే టైంలో రక్తం గడ్డ కట్టకుండా మెషిన్ లోకి వెళ్లడానికి టాబ్లెట్స్ ఇస్తారు. వాటి వల్ల బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుందట. అలాగే ట్యూబ్స్ పెట్టే చోట ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందట. రక్తం గడ్డ కట్టడం, ట్యూబ్ లలో గాలి చేరడం జరుగుతుంది. అలాగే ఈ క్రమంలో కృష్ణ గారికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తట్టుకుని కృష్ణ గారి శరీరం సహకరించిన ప్రాణం నిలబడిన సాధారణ స్థితికి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇదే విషయాన్ని వైద్యులు కృష్ణా కుటుంబంతో చెప్పడం జరిగింది. ఇద్దరు భార్యలను, కొడుకుని కోల్పోయి మానసికంగా కృంగిపోయిన కృష్ణ గారు ఈ ఎక్మో ట్రీట్మెంట్ ని చేయించుకునే స్థితిలో లేరు. అందుకే పోయే ముందు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కృష్ణ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
read also : 40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న స్టార్లు !