Advertisement
శృతిహాసన్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొందరు డేటింగ్ లో తనతోనే ఖర్చు పెట్టించారని ఆమె చెప్పారు. ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ డేటింగ్ గురించి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంటర్వ్యూలో రిలేషన్షిప్, డేటింగ్ల గురించి స్పందించారు. పార్ట్నర్ లో ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పడంతో పాటుగా డేటింగ్ లో తనకి ఎదురైనా అనుభవాల గురించి చెప్పారు. డేటింగ్ కి వెళ్ళినప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలు ఖర్చు పెట్టడం కామన్.
Advertisement
Advertisement
కానీ నాకు రివర్స్ అయిందని శృతిహాసన్ చెప్పారు. కొందరు తన చేత ఖర్చు పెట్టించారని అన్నారు. నా దగ్గర డబ్బు బాగా ఉంది కదా అని వాళ్ళ ఫీలింగ్ అని శృతిహాసన్ చెప్పారు. అలా ఖర్చు పెట్టడం తన ప్రేమ భాషగా తను భావించినా.. దీని వలన తన గుణపాఠం నేర్చుకున్నట్లు కూడా శృతిహాసన్ చెప్పారు. నేను సరే అనే దాన్ని. నీకు ఏం కావాలన్నా తెచ్చిస్తాను నేను బిల్లు ఇస్తాను ఎందుకంటే అది నా స్వభావం నా ప్రేమ భాష అని ఆమె అన్నారు.
Also read:
మూడు నెలల తర్వాత మనం ఎన్ని సార్లు బయట భోజనం చేసాము. కానీ బిల్లు ఇవ్వలేదు అని నేను అనే దాన్ని కానీ నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా అని వాళ్ళు అనే వారని అక్కడే నాకు మండేది అని ఆమె చెప్పింది. ఇప్పుడు మాత్రం ఇద్దరం ఖర్చు భరిద్దాం అంటున్నాను అని ఆమె చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!