Advertisement
ప్రేమలో అందరూ పడుతూ ఉంటారు. కానీ ప్రేమించిన వ్యక్తిని పొందడం జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి ఉండడం అందరికీ సాధ్యం కాదు. అయితే ఒకసారి ఇతరులు ప్రేమలో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మగవాళ్ళు ప్రేమిస్తున్నారా..? ప్రేమలో ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. మగవాళ్ళు ప్రేమలో ఉన్నట్లయితే ఈ సంకేతాలు కనిపడతాయి. మరి మగవాళ్ళు ప్రేమలో ఉంటే ఏ లక్షణాలు కనబడతాయి అనేది ఇప్పుడే చూద్దాం. ప్రేమలో పడ్డ వ్యక్తులు ప్రవర్తన ఆలోచన ఫీలింగ్స్ అన్ని కూడా మారుతాయి. లైఫ్ చాలా హ్యాపీగా కలర్ ఫుల్ గా కనబడుతూ ఉంటుందంట. ఆ ప్రేమలో పడిన అమ్మాయిలతో పాటుగా అబ్బాయిల్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి.
Advertisement
అయితే ఒక అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడని అమ్మాయి తెలుసుకోవడం కొంచెం కష్టం. మగవారు తమ బలహీనతలను అంత ఈజీగా బయటపెట్టారు. ప్రేమించే యువతి ముందు మాత్రం అన్ని బలహీనతలను బాధలను చెప్పుకుంటూ ఉంటారు. ఎమోషన్స్ ఫీలింగ్స్ చెబుతూ సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. ఏడవడానికి కూడా వెనుకాడరు ఇలా చేయడం ద్వారా ఆమె నుండి ఎమోషనల్ సపోర్ట్ ను కోరుకుంటారు అలాగే ఒక యువకుడు ఒక యువతను నిజంగా ప్రేమిస్తున్నాడంటే ఆమెతో ఎలాంటి గేమ్స్ ఆడడు. ఆందోళన కలిగించే విధంగా ప్రవర్తించడు. స్పష్టంగా మాట్లాడుతాడు. ఫీలింగ్స్ ని గౌరవిస్తాడు.
Advertisement
Also read:
ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నట్లయితే ఆమె అలవాట్లు ప్రవర్తనలు వారికి ఏమాత్రం ఇబ్బందిని కలిగించవు ఇరిటేషన్ రాదు. అమ్మాయి చేసే పనులు కానీ మాటలు కానీ అభిరుచులు కానీ వారికి నచ్చుతాయి. అలానే అతను తన నిజమైన వ్యక్తిత్వాన్ని మాత్రమే చూపిస్తాడు ధనవంతుడు లాగా గొప్ప వ్యక్తి లాగ యాక్ట్ చేయడు. తను ఎలా ఉంటే అలానే నిజాయితీగా ఆమె ముందు ఉంటాడు. ప్రేమించే అమ్మాయి స్వేచ్ఛకు అబ్బాయి భంగం కలిగించడు. ఆమెకు సలహా ఇవ్వడానికి ఆమె జీవితంలో జోక్యం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడు. బదులుగా ఆమె నిర్ణయాలను గౌరవిస్తాడు. సపోర్ట్ ఇస్తాడు. ఒక యువకుడు యువతను ప్రేమిస్తున్నట్లయితే ఆమెతో ఎక్కువ సేపు గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!