Advertisement
రోగ నిరోధక శక్తి ఉంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు. శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి సీజనల్ వ్యాధులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది రోగనిరోధక శక్తి లోపం వలన బాధపడుతున్నారు. రోగ నిరోధక శక్తి బలంగా ఉన్న వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాం. చిన్న చిన్న పనులకి విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది. చల్లని ప్రదేశాల్లో చేతులు చల్లబడి వణికిపోతున్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనే సంకేతం. కళ్ళు పోడిబారి కంట్లో ఇబ్బందిగా ఉండడం కంటి చూపు మందగించడం వంటి సమస్యలు ఉన్నట్లయితే రోగి నిరోధక శక్తి తగ్గినట్లు.
Advertisement
Advertisement
కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు జలుబుతో బాధపడుతున్నట్లయితే కూడా రోగనిరోధక శక్తి మీకు తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. శరీరంలో ఏవైనా గాయాలు ఏర్పది అవి త్వరగా మానేకపోతే కూడా రోగ నిరోధక శక్తి మీకు తక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న పనులకు అలసిపోవడం, నడుస్తున్నప్పుడు ఆయాస పడటం వంటివి జరుగుతుంటే కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉందని సూచన.
Also read:
రోగనిరోధక శక్తి లోపించినప్పుడు తీవ్ర తలనొప్పి వస్తుంది. అలాగే తలనొప్పి ఎంతకీ తగ్గదు. ఇమ్యూనిటీ డెఫిషియన్సీ తో బాధపడుతున్నట్లు భావించాలి. బయట ఆహారం తిన్నప్పుడు తరచూ అజీర్తి సమస్యలు కనబడితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే పెంచుకోవడానికి చూడండి రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలను తీసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!