Advertisement
ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని అనుకుంటుంటారు. మెరసే చర్మం కోసం చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మెరిసే చర్మం కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మెరసే చర్మాన్ని పొందాలనుకుంటే ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన చర్మం అందంగా ఆకర్షణంగా ఉండడానికి సరైన స్కిన్ కేర్ తో పాటుగా శరీర పోషణ కూడా చాలా ముఖ్యం. ఉదయం పూట ఇక్కడ చెప్పిన డ్రింక్స్ ని తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Advertisement
చాలా మంది రెగ్యులర్ గా గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీ లో యాంటి ఇన్ఫ్లమెంటరీ గుణాలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ముఖంపై మచ్చలు ముడతలు రాకుండా గ్రీన్ టీ చూస్తుంది. గ్రీన్ టీ తాగితే జీవక్రియ రేటు పెరుగుతుంది గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం వేసుకొని తీసుకుంటే చర్మం బాగుంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన దరి చేరవు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మ కణాలని ఆరోగ్యంగా ఉంచుతుంది అదే విధంగా అల్లం పసుపు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ముఖంపై మచ్చలు గీతాలు తొలగించగలవు. కలబంద గుజ్జు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.
Advertisement
Also read:
కలబంద గుజ్జులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. కలబంద రసాన్ని తీసుకోవడం వలన ఉత్పత్తి పెరుగుతుంది. నీళ్లలో చియా సీడ్స్ ని వేసుకుని తీసుకుంటే కూడా చక్కటి లాభాలు ఉంటాయి. చర్మం చాలా బాగుంటుంది. కొబ్బరినీళ్లు తీసుకుంటే కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరినీళ్ళని ఉదయాన్నే తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగు పడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!