Advertisement
చలికాలంలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. చలికాలంలో జలుబు కూడా ఎక్కువగా ఉంటుంది. జలుబు నుంచి ఉపశమనం కలగాలంటే ఇలా చేయండి. చలికాలంలో జలుబుని నివారించే సింపుల్ చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం. జలుబు సమస్యతో బాధపడే వాళ్ళు రెగ్యులర్ గా ఆవిరి పడుతూ ఉండాలి. అలా చేయడం వలన ఉపశమనం కలుగుతుంది. మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే వేడి నీటిని తీసుకోండి.
Advertisement
జలుబు చేసినప్పుడు వేడి నీళ్లు తాగడం వలన రిలీఫ్ కలుగుతుంది. వేడినీళ్లలో కొంచెం తేనె, నిమ్మరసం వేసుకొని తీసుకుంటే కూడా బాగుంటుంది జలుబుతో బాధపడే వాళ్ళు వేడి వేడి పాలలో కొంచెం పసుపు వేసుకుని తీసుకోండి. ఇది కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. బార్లీ గింజల్ని నీళ్లలో వేసి మరిగించి మరిగిన మిశ్రమంలో కొంచెం నిమ్మరసం వేసుకొని తీసుకుంటే కూడా జలుబు నుంచి రిలీఫ్ కలుగుతుంది.
Advertisement
జలుబు సమస్య ఉన్నట్లయితే అల్లం టీ తీసుకోండి. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్చు జలుబుతో బాధపడే వాళ్ళు రిలీఫ్ కోసం మిరియాలని పాలలో వేసుకుని తీసుకోవచ్చు. లేదంటే కషాయం కింద చేసుకొని తీసుకోవచ్చు. జలుబు సమస్య ఉన్నవాళ్లు వేడివేడి సూప్స్ తీసుకుంటే కూడా బాగుంటుంది వాము రసాన్ని తీసుకుంటే కూడా జలుబు ఉన్న వాళ్ళకి రిలీఫ్ కలుగుతుంది లేదంటే తులసి జ్యూస్ ని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా చక్కటి రిలీఫ్ ని ఇస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!