Advertisement
జానపద గేయాలు పాడటం ద్వారా లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు సింగర్ మంగ్లీ. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తండాలో జన్మించిన మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుని టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మ్యూజిక్ అండ్ డ్యాన్స్ లో డిప్లమా చేశారు. సంగీతంలో మెలకువలను నేర్చుకుని తెలంగాణ పల్లె పాటలు పాడటం ద్వారా మంగ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
చాలామంది మంగ్లీ భాష, పాటలను చూసి ఆమె తెలంగాణకు చెందిన వ్యక్తి అని భావిస్తారు. మంగ్లీ అసలు పేరు సత్యవతి. కాగా యాంకర్ అయిన తర్వాత ఛానల్ సూచనల మేరకు ఆమె పేరును మార్చుకున్నారు. మంగ్లీ అనే పేరుతోనే ఆమె పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇది ఇలా ఉండగా ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రానున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
మంగ్లీకి ఎస్విబిసి ఛానల్ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగా, ఇటీవలె ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండేళ్ల పాటు మంగ్లీ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆమెకు ప్రభుత్వం నెలకు లక్ష రూపాయలు జీతంగా చెల్లించనుంది. కాగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులకు కూడా ఇటీవలే సీఎం జగన్ కీలక పదవులు కట్టబెట్టారు. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. అలాగే, ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి వరించింది.