Advertisement
Sita ramam Dialogues in Telugu and Dialogues Lyrics Telugu: వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘సీతారామం‘. ఇందులో హీరోగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. దుల్కర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళి ఠాగూర్ నటించింది.
Advertisement
టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే పాజిటివ్ తాతన సొంతం చేసుకుంది. ఇది క్లాసిక్ అవుతుంది అని ముందునుండి చెప్పుకొచ్చింది. కానీ ఇది చాలా గొప్ప సినిమా అని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందమైన పాటలు, ఎక్కడా లేని సన్నివేశాలు.
బూతు డైలాగులు వంటివి లేని సంభాషణలు. మానవత్వాన్ని తట్టి లేపే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ వంటి గొప్ప చిత్రాలను తలపించేలా హాను ‘సీతారామం’ ని తీర్చిదిద్దాడు. ఇందులో మంచి Sita Ramam Movie Dialogues in Telugu కూడా ఉన్నాయి.
Advertisement
Sita ramam Movie Dialogues in Telugu సీతారామం సినిమాలోని అదిరిపోయే డైలాగులు !
- కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం.
- నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే, కాశ్మీర్ ని మంచుకి వదిలేసి వస్తారా?
- ఇక్కడ చాలా చల్లగా ఉంది. కాశ్మీర్ నుండి మీరు ఏమైనా పంపుతున్నారా?
- ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా? ఈ రుతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండకుండా వెళ్లిపోతున్నాయి.
- ఇక చీకట్లో ఉన్నది చాలు నా మేనకోడలు కస్తూరి పైన వెలుగుపడాలి.
- ఇంత అందం, అబద్ధం చెప్తే నిజం కూడా నిజమని నమ్మేయదు?
- నువ్వు అలా వెళ్ళిపోతుంటే, ఇంత వర్షంలో కూడా నా ఊపిరి ఆవిరి అయిపోతుంది.
- ఇకపై నేను అనాధని కాదు కదా?
- అప్పట్లో సీత కోసం రాముడు వచ్చాడు. కానీ ఇప్పుడు రాముడి కోసం సీతనే వచ్చింది.
- దేశం కోసం యుద్ధం చేసేవాడు సైనికుడు, ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు.
- గెలుపు అని చెప్పుకోలేని బాధ, ఓటమిని చెప్పుకోలేని బాధ్యత.
- నీ దేశం నిన్ను అనాధని చేసింది అని కోపంగా ఉన్నావా? నేను పుట్టకతోనే అనాధని రా, కానీ ఎప్పుడూ అమ్మ మీద కోపం రాలేదు.
- వాడు నిజంగా తప్పు చేశాడో లేదో తెలియదు, కానీ బరువు మాత్రం సీత మోసింది.
- నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు, కానీ పక్క దేశాన్ని ద్వేషించడం తప్పే.
- ఓ సైనికుడు శత్రువుకి అప్పగించిన యుద్ధం, ఈ యుద్ధంలో సీతారాములను నువ్వే గెలిపించాలి.
READ ALSO : చికెన్ పాక్స్ ని ‘అమ్మవారిగా’ లేదా ‘అమ్మ పోసింది’ అని ఎందుకు పిలుస్తారు ?