Advertisement
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ, కేఏ పాల్, రామచంద్ర యాదవ్, జడ శ్రవణ్ కుమార్ వంటి వాళ్లు పోటీ చేయడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన వివి లక్ష్మీనారాయణ విశాఖ నర్త అసెంబ్లీ నుండి పోటీ చేశారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖపట్నం పార్లమెంట్ గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశారు. భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరు తో పాటుగా మంగళగిరి నుండి కూడా పోటీ చేయడం జరిగింది. జై భీమ్ రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మంగళగిరి నుండి అసెంబ్లీ కి పోటీ చేశారు. ఇక ఎవరికి అలా ఓట్లు వచ్చాయి అనే విషయాన్ని చూసేద్దాం.
Advertisement
కేఏ పాల్:
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు అసెంబ్లీ స్థానాలు నుండి పోటీ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుండి బరిలోకి దిగారు. 1700 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు ఇక్కడ గెలిచారు. విశాఖపట్నం నుండి పోటీ చేసిన ఈయనకు 7,696 ఓట్లు వచ్చాయి.
జెడి లక్ష్మీనారాయణ:
Advertisement
లక్ష్మీనారాయణ ముందు జనసేన పార్టీలో చేరారు 2019 ఎన్నికల్లో పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేశారు 23.3% ఓట్లు రావడంతో మూడో స్థానంలో నిలిచారు. ఈసారి జయభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఆయన రిజిస్టర్ చేసి తనతో పాటుగా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని దింపారు. విశాఖ నార్త్ అసెంబ్లీ నుండి బరిలోకి దిగారు. బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయాన్ని సాధించగా రెండవ స్థానంలో వైసీపీ మూడవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి చోటు దక్కించుకున్నారు. లక్ష్మీనారాయణకు 5160 ఓట్లు వచ్చాయి.
Also read:
బోడె రామచంద్ర యాదవ్:
2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల్ని బరిలోకి దించారు పుంగనూరులో మూడో స్థానంలో నిలిచిన ఆయనకు 459 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడికి గెలిచారు.
జడ శ్రవణ్:
జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మంగళగిరి నుండి పోటీ చేశారు 416 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also read:
షర్మిల:
వైయస్ షర్మిల కడప పార్లమెంట్ కి పోటీ చేశారు. ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు ఈ ఎన్నికల్లో 10.67 ఓట్లు వచ్చాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!