Advertisement
హైదరాబాద్ మహానగరంలో పాములు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అది కూడా రద్దీ ఏరియాలో అంటే కష్టమే. కానీ, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. ఓ స్నేక్ రోడ్డుపై హల్ చల్ చేసింది. ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ తిరుగుతూ అందర్నీ హడలెత్తించింది. కేపీహెచ్బీ దగ్గర కనిపించిందీ సీన్.
Advertisement
వాహనాలతో రద్దీగా ఉండే ఈ ఏరియాలోకి వచ్చిన ఆ పాము ఓ కారు టైర్ కింద పడింది. అయితే.. డ్రైవర్ అప్రమత్తతో అది ప్రమాదం నుంచి తప్పించుకుంది. వెళ్లిపోతుందేమోనని కాసేపు కారు ఆపేశాడు డ్రైవర్. కానీ, అది కదల లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Advertisement
అయితే.. అటుగా వెళ్తున్న కేపీహెచ్బీ ఎస్సై మహేశ్ స్థానికుల సహాయంతో పామును బకెట్ తో పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సై వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. వాళ్లు వచ్చి.. ఆ పామును దూరంగా వదిలేశారు
హైదరాబాద్ లో ఖాళీ ఏరియాలు చాలానే ఉన్నాయి. వివాదాల్లో ఉన్న భూములు, బడాబాబులు కొని వదిలేసిన ల్యాండ్స్ చాలానే ఉన్నాయి. అలాంటి ప్రదేశాలు పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇలా అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి అవి అందర్నీ హడలెత్తిస్తున్నాయి.