Advertisement
అతి మూత్ర విసర్జన ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా మహిళల్లో అతిమూత్ర విసర్జన సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. నీరు ఎక్కువగా తాగిన సందర్భాల్లో మూత్రం ఎక్కువగా వస్తుంది. కానీ నీరు తీసుకొని సమయంలో కూడా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే దానిని అతిమూత్ర విసర్జన సమస్యగా భావించాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలే మనలో మూత్రం తయారు అవడానికి కారణం అవుతాయి. కనుక కొన్నిరకాల ఆహార నియమాలను పాటించడం వల్ల మనం ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
Advertisement
సిట్రస్ అధికంగా ఉండే నారింజ, నిమ్మ, బత్తాయి, పైనాపిల్, ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. కనుక అతిమూత్ర విసర్జనతో బాధపడేవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రశయం పై ఒత్తిడిని కలిగించే సీతల పానీయాలను తీసుకోకూడదు. అలాగే కెఫిన్ కలిగి ఉండే టీ, కాఫీలను, ఎనర్జీ డ్రింక్, చాక్లెట్లను కూడా తీసుకోకూడదు.
Advertisement
ఖర్జూరాలను ఎక్కువగా తినడం వల్ల కూడా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చీజ్ కలిగిన పదార్థాలను పుల్లటి రుచి కలిగి ఉండే క్రీములను తీసుకోవడం వల్ల మూత్రశయం పై ఒత్తిడి అధికమై తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మూత్రంలో మంట నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. అతి మూత్ర వ్యాధితో బాధపడేవారు ఆల్కహాల్ ను తీసుకోకపోవడం మంచిది. అలాగే వీరు పచ్చి టమాటాలను, పచ్చి ఉల్లపాయను, చక్కెరను కూడా ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. బెర్రీల్లో కూడా ఆమ్లాల శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తినగానే మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది. ఇవి తినడం వల్ల గుండెల్లో మంట కూడా వస్తుంది.
READ ALSO : కొరటాల శివ భార్య ఎవరు…ఆమె గురించి తెలిస్తే, ఫిదా అవ్వాల్సిందే !