Advertisement
కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురవ్వడం పార్టీ శ్రేణులను కంగారుపెడుతోంది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు ఆమె. డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు. డాక్టర్ అరూప్ బసు ఆధ్వర్యంలో సోనియాగాంధీకి చికిత్స కొనసాగుతోంది. తీవ్ర జ్వరంతో ఆమె బాధపడుతున్నట్టు సమాచారం.
Advertisement
కొద్ది రోజుల క్రితం కూడా సోనియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కూడా గంగారామ్ ఆస్పత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. కొన్నాళ్లకు కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఆమె అస్వస్థతకు గురి కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
ఈమధ్యే ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడు రోజులపాటు జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. రెండో రోజు కార్యకలాపాల్లో భాగంగా పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసే అవకాశం ఉంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే విషయం. జోడో యాత్ర.. పార్టీకి టర్నింగ్ పాయింట్. దేశంలో శాంతి, సామరస్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని రుజువైంది’’ అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారా? అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
రిటైర్మెంట్ పై చర్చ సాగుతుండగానే సోనియా అస్వస్థతకు గురికావడంతో అంతా కంగారుపడుతున్నారు. 2024 ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేస్తున్న ఈ తరుణంలో ఆమె తరచూ అనారోగ్యం పాలవుతుండడం.. పార్టీ శ్రేణులను కాస్త నిరుత్సాహానికి గురి చేస్తోంది.