Advertisement
అలనాటి మేటి నటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో పేరు పొందిన హీరోయిన్ అందాల తార సౌందర్య. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. మరి అలాంటి సౌందర్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
Advertisement
also read:ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్స్ సైలెంట్ వెనుక అసలు కారణం ఇదేనా..?
Advertisement
సౌందర్య నటించిన సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే చాలా మంది కళ్ళకు నీళ్లు వస్తాయి. ఇండస్ట్రీలో ఈమె చిరంజీవి, వెంకటేష్ లతో కాంబినేషన్ వచ్చిందంటే సూపర్ హిట్ అయ్యేది. ఈమె తెలుగులో బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల మొదలై అయిపోయింది. ఇదే ఆమె చివరి చిత్రం.. సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే బీజేపీ పార్టీలో చేరారు సౌందర్య.. అయితే పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం హెలికాఫ్టర్లో బయలుదేరి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆమెతో పాటుగా తన అన్న కూడా హెలికాప్టర్ లో ఉన్నారు.
అయితే సౌందర్య మరణించే సమయానికి ఆమె మ్యారేజ్ కూడా అయింది. నా చిన్ననాటి స్నేహితుడు వరుసకు మేనమామ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘుని 2003లో ఆమె వివాహం చేసుకుంది. ఇక పెళ్లి జరిగిన సంవత్సరానికి ఆమె మృతి చెందడంతో రఘు డిప్రెషన్ లోకి వెళ్లారట. అతను కోలుకోవడానికి దాదాపు చాలా సమయం పట్టిందని సమాచారం. ఆ తర్వాత కొన్నాళ్ళు వెయిట్ చేసిన రఘు 2011లో మళ్ళీ పెళ్లి చేసుకొని గోవాలో ఉంటున్నారని తెలుస్తోంది.. సౌందర్య ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ప్రస్తుతం పాడుబడ్డ బంగలాల మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.
also read: