Advertisement
2001 మార్చి 11న ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య కలకత్తాలు టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కసితో ఉన్న ఆసీస్ ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ వా ఏకంగా సెంచరీ బాదేశాడు. తర్వాత బౌలింగ్ కూడా ఆసీస్ ది అదే కసి. దీంతో 40 పరుగులకే ఓపెనర్స్ తో సహా సచిన్, ద్రవిడ్ పెవిలియన్ చేరారు. అలాంటి క్లిష్ట సమయంలో గ్రీస్లోకి వచ్చినా గంగూలిని చుట్టుముట్టేసింది ఆస్ట్రేలియా టీం.
Advertisement
దాదాపై మాటలు దాడికి దిగారు. అప్పట్లో గంగూలీకి సినీ హీరోయిన్లతో అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని టార్గెట్ చేసి ఎవరు ? ఆమె బాగుంటుందా ? అంటూ గంగూలీ తో స్లెడ్జింగ్ చేశారు. ఏకంగా గంగూలీ పర్సనల్ లైఫ్ వరకు వెళ్లిందా దాడి. ఏంటి నీ సె** లైఫ్ ఎలా ఉంది ఏమైనా ప్రాబ్లం ఉందా అంటూ గంగూలీని దారుణంగా స్లెడ్జింగ్ చేశారు. ఇలా ఒక్క ఆటగాడి పై 11 మంది ఏక దాటిగా దాడి చేస్తే ఎవరి రక్తమైనా సలసల మరిగిపోతుంది. అలానే గంగూలీ లో కూడా కోపం కట్టలు తెచ్చుకుంది. అదే ఆవేశంలో ఏకాగ్రత కోల్పోయి అవుటయ్యాడు.
Advertisement
ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 170 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఒక్క లక్ష్మణ్ తప్ప ఎవరు ఆశించిన స్థాయిలో ఆడలేక, ఔట్ అయ్యారు. దీంతో ఇండియా ఫాలో అన్ ఆడాల్సి వచ్చింది. ఇదే అదునుగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మళ్లీ నోటికి పని చెప్తారు. ఇండియాతో మ్యాచ్ ఆడుతుంటే బోర్ కొడుతుంది కనీసం ఫాలో ఆన్ కూడా తప్పించు కోలేకపోతున్నారంటూ జబ్బలు చరిచారు. ఇక గంగూలీ ప్లాన్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ బాగా ఆడిన లక్ష్మణ్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి అవుట్ అవ్వడం అంటే ఏంటో తెలియదన్నట్లు ఆడాడు. కానీ సచిన్ టెండూల్కర్ 10 పరుగులు చేసి వెంటనే అవుటయినా, గంగూలీ మాత్రం లక్ష్మణ్ తో కలిసి 117 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మిస్తాడు. కానీ చివరగా 657 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, డేరింగ్ నిర్ణయం తీసుకుంటాడు గంగూలీ. ఇక బౌలింగ్ లో హర్భజన్ సింగ్ తన స్పిన్ మాయాజాలంతో ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసిస్తాడు. భజ్జికి సచిన్ కూడా మూడు వికెట్లతో మద్దతుగా నిలుస్తాడు. దీంతో 212 పరుగులకే ఆస్ట్రేలియాను కుప్పకూలి ఏకంగా 171 పరుగుల తేడాతో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధిస్తుంది. ఫాలో ఆన్ ఆడి, టెస్ట్ గెలిచిన జట్టుగా చరిత్రలో నిలిచిపోతుంది టీమిండియా.
READ ALSO : Kantara : ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఊహించని షాక్ ఇచ్చిన కాంతార సినిమా..!
2001 కోల్కతా టెస్ట్ ఆస్ట్రేలియా తో గెలుపు లక్ష్మణ్, ద్రావిడ్ కాదు గంగూలీ ఎలాగంటే ?
T20 World Cup 2022: జింబాబ్వేపై గెలుపు, సెమీస్‍లోకి భారత్ ఎంట్రీ.. ఆ జట్టుతోనే ఫైట్